NTV Telugu Site icon

Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీకి మరో అరుదైన గుర్తుంపు..

Biryani

Biryani

TasteAtlas: ఈ ప్రపంచంలో హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరు లెవల్ అనుకోండి.. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన దొరుకుతుంది. మొన్న స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పెట్టిన ఆహారంగా కూడా మన హైదరాబాద్ బిర్యానీనే రికార్డులకెక్కి్ంది. తాజాగా, ట్రావెల్ గ్లోబల్.. ఈట్ లోకల్ అనే అంశంతో పని చేసే ప్రముఖ పర్యాటక ఆన్ లైన్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ఉత్తమ ఆహార పరదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్ బిర్యానీ స్థానం దక్కించుకుంది.

Read Also: MS Dhoni: ఎంతో కష్టంగా ఉన్నా.. నా అభిమానుల కోసమే ఇదంతా: ధోనీ

అయితే, సదరు సంస్థ వివిధ దేశాలకు చెందిన నగరాలు.. అక్కడి ఆహార పదర్థాలపై సమీక్ష చేసి ఈ స్థానాలను విడుదల చేసింది. అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 నగరాల్లో మన హైదరాబాద్ బిర్యానీ 39వ స్థానాన్ని దక్కించుకుంది. ముంబై 35వ స్థానం, ఢిల్లీ 56, చెన్నై 65, లక్నో 92వ స్థానాల్లో నిలిచాయి. కాగా, ఆహార పదార్థాల జాబితాలో అగ్రస్థానంలో ఇటలీ వంటకాలు నిలిచినట్టు ఆ సంస్థ వెల్లడించింది. మన దేశ ఆహార పదార్థాల్లో పావ్ భాజీ, దోశ, వడాపావ్‌, కబాబ్స్, పానీపురి, బిర్యానీలను అధికంగా ఇష్టపడుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇక, మన హైదరాబాద్ విషయానికి వస్తే బిర్యానీకే టేస్ట్ ఫుడ్ అట్లాస్ జై కొట్టిందని చెప్పుకొచ్చు.

Show comments