Site icon NTV Telugu

Hyderabad: రాజధాని బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తంతో తప్పిన ప్రమాదం..

Rajadhani Bus Accident

Rajadhani Bus Accident

బస్సుల్లో ప్రయానించాలంటే జనాలు వణికిపోతున్నారు.. అటు రైలు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకప్పుడు ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.. కానీ ఈ మధ్య ప్రభుత్వం బస్సుల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.. మొన్న కూకట్ పల్లి బస్సు ప్రమాదం మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ లో మరో బస్సు ప్రమాదానికి గురైంది.. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సు ప్రయాణం అంటే గుండెల్లో వణుకు పుడుతుంది.. అయితే ఏసీ బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా హైదరాబాద్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది..

అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికుంలతా క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు ఆర్టీసీ బయలు దేరింది. ఇంతలోనే బస్సు హైదరాబాద్‌ శివారులోని పెద్ద అంబర్‌పేట్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. అయితే ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే అలర్ట్‌ అయ్యాడు. అప్రమత్తతతో వ్యవహరించి ప్రయాణికులందరినీ కిందకు దించేసి, ఫైర్‌ ఇంజన్‌కు సమాచారం అందించారు..

సమాచారం అందుకున్న అగ్ని మాపక వాహనాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి.. దాదాపు గంట పాటు శ్రమించి బస్సులోని మంటలను అదుపు చేసారు అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉండగా అందరూ క్షేమంగా బయటపడ్డారు.. మంటలు ఆరిపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ భాగం బస్సు పూర్తిగా ఖాళీ బూడిద అయ్యింది.. ప్రాణ నష్టం జరగలేదు.. కానీ ప్రయాణికుల లగేజ్ అందులోనే బూడిద అయ్యినట్లు సమాచారం.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు..

Exit mobile version