చైనాలో ఒక వ్యక్తి రూ. 12.3 కోట్ల (123 మిలియన్ రూపాయలు) విలువైన లాటరీని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. కానీ ఆ ఆనందం స్వల్పకాలికంగా మారింది. ఆ డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఒక మహిళా లైవ్-స్ట్రీమర్ కోసం ఖర్చు చేశాడు. దీనితో అతని భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది. లాటరీ గెలిచిన తర్వాత తాను మొదట్లో చాలా సంతోషంగా ఉన్నానని ఆ వ్యక్తి భార్య యువాన్ చెప్పింది. అతను యువాన్‌కు రూ. 36 మిలియన్లు ఉన్న బ్యాంక్ కార్డును కూడా ఇచ్చాడని తెలిపింది.
Also Read:Delhi High Court: ఉద్యోగం, జీతం ఉన్న మహిళలకు “భరణం” ఎందుకు..?
యువాన్ కార్డును పరిశీలించి తన దగ్గర పెట్టుకుంది. కానీ కొంతకాలానికే ఆమె భర్త ప్రవర్తన మారిందని తెలిపింది. నివేదికల ప్రకారం, అతను పగటిపూట జూదం ఆడటం, రాత్రిపూట మహిళల ప్రత్యక్ష ప్రసారాలను చూడటం ప్రారంభించాడు. అతను అనేక మంది మహిళా హోస్ట్‌లకు పెద్ద మొత్తంలో టిప్ ఇచ్చాడని వెల్లడించాయి. ఒక నివేదిక ప్రకారం, అతను లైవ్ స్ట్రీమర్ కు రూ. 1.4 కోట్ల టిప్ ఇచ్చాడని తెలిపింది. నాలుగు రోజుల ట్రిప్ కి కూడా తీసుకెళ్లాడని, కానీ యువాన్ అతన్ని రైల్వే స్టేషన్ లో పట్టుకున్నదని వెల్లడించింది.
Also Read:Adina mosque: ఆదినా మసీదా లేదా ఆదినాథ్ ఆలయమా.? యూసఫ్ పఠాన్ వివాదం..
తరువాత, యువాన్ తన భర్త మొబైల్ ఫోన్‌లో చాట్‌లను గుర్తించింది. అందులో అతను ఆ మహిళను “హనీ” అని, తనను తాను “హబ్బీ” అని పేర్కొన్నాడు. దీని తర్వాత యువాన్ తనకు ఇచ్చిన బ్యాంక్ కార్డులో డబ్బు లేదని గుర్తించింది. వెంటనే భర్తను నిలదీసింది. నాకు అన్యాయం చేస్తున్నావు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఖరికి విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యింది.
