NTV Telugu Site icon

Husband Murdered By Wife: ట్రెండ్ మారింది.. ఆస్తి కోసం భర్తను 30 ముక్కలుగా నరికిన భార్య

Murder

Murder

Husband Murdered By Wife: ఓ మహిళ తన భర్తను హత్య చేసి ఆపై, అతని శరీర భాగాలను 30 ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి వివిధ ప్రాంతాలలో విసిరివేసింది. సిడ్నీలో 53 ఏళ్ల ఆస్ట్రేలియా మహిళ నిర్మిన్ నుఫాల్ తన 62 ఏళ్ల భర్త మమ్‌దౌహ్ ఇమాద్ ను హత్య చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మే 3వ తేదీన పశ్చిమ సిడ్నీలోని గ్రీన్‌కర్ హోమ్‌లో భార్య నౌఫల్ తన భర్తను కత్తితో పొడిచి హత్యా చేసింది. ఆ తర్వాత రంపంతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసిందని పోలీసులు తెలిపారు. హత్యానంతరం భార్య తన భర్త శరీర భాగాలను 30 ప్లాస్టిక్ సంచులలో ఉంచి, వాటిని వివిధ ప్రదేశాలలో డస్ట్‌బిన్‌లలో పడేసిందని పోలీసులు తెలిపారు.

Also Read: Egg Price Hike: కూరగాయలు మాత్రమే కాదు.. కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది! చుక్కలు చూస్తున్న సామాన్యులు

దీని తరువాత భార్య నుఫాల్‌ను మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో పరీక్షించిన తర్వాత గత నెలలో అరెస్టు చేశారు. అయితే, ఆమె భర్త మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. గతేడాది తమ ఇంట్లోనే నౌఫల్ తన భర్తను ఉద్దేశపూర్వకంగా చంపినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో భార్య హత్య చేయడంతో భర్త హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో అతని కోసం వెతుకులాట మొదలైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. మేలో అతను అదృశ్యమైన తర్వాత, సిడ్నీ పశ్చిమ ప్రాంతంలోని గ్రీన్‌కర్‌ లోని జూనో పరేడ్‌లో అతని ఇంటికి పోలీసులు వచ్చారు.

Also Read: NZ vs ENG: అబ్బా ఏం కిక్ ఉంది మామ.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్

ఈ కేసుపై తాజాగా న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిర్మీన్ నౌఫల్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. వ్యక్తిగత కారణాల వల్లే భార్య నుఫాల్ తన భర్తను హత్య చేసిందని ఈ కేసులో లాయర్ తెలిపారు. భార్య నుఫాల్ తనకు సంతోషంగా లేని సంబంధం నుండి తప్పించుకోవాలనుకుంటుందని లాయర్ తెలిపారు. మే నెలలో ఈజిప్టులో ఆస్తిని సొంతం చేసుకునేందుకు భర్త నుండి భార్యకు చట్టపరమైన అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఆమె ఆ సంబంధం నుండి బయటపడాలనుకునే అవకాశాన్ని చూసిందని లాయర్ కోర్టుకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్తను చంపిన తర్వాత నుఫాల్ ఈజిప్టుకు వెళ్లింది. అక్కడ ఆమె తన భర్త భూములను రూ. 1 కోటి 70 లక్షల విలువచేసే ఆస్తులను విక్రయించి, ఆపై ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిందని విచారణలో తేలింది. ప్రస్తుతం నుఫాల్ మానసిక అనారోగ్యంతో సహా అనేక వ్యాధులను ఎదుర్కొంటోంది. దాంతో ఈ అంశంపై తదుపరి విచారణను కోర్టు డిసెంబర్ 11కు వాయిదా వేసింది.

Show comments