NTV Telugu Site icon

Bowenpally Crime News: బోయిన్‌పల్లిలో దారుణం.. భార్య, కుమార్తెను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త!

Death

Death

Man Kills Wife and Daughter in Bowenpally: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్య, 10 నెలల కన్న బిడ్డను ఓ వ్యక్తి చంపాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు.

మహారాష్ట్ర నాంథేడ్‌కు చెందిన గణేశ్, స్వప్న దంపతులు. బోయిన్‌పల్లిలోని ఆర్యసమాజ్ వద్ద వీరు నివాసం ఉంటున్నారు. స్వప్న, గణేశ్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా.. 10 నెలల వయస్సున్న నక్షత్ర అనే కూతురు ఉంది. గణేశ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మూడవ కూతురు నక్షత్ర తనకు పుట్టలేదని గణేశ్‌కు అనుమానం. ఆ అనుమానంతోనే తరచుగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది. అనుమానం పెనుభూతమై ఆదివారం తెల్లవారుజామున భార్య, కుమార్తెను గొంతు నులిమి చంపేసిన గణేశ్‌.. అనంతరం అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంపేటలో రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు.

Also Read: Ujjaini Mahankali Bonalu: బంగారు బోనంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు!

ఎన్‌టీవీతో ప్రత్యక్ష సాక్షి సువర్ణ మాట్లాడుతూ… ‘ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో గణేశ్ బయటికి వెళ్తూ కనబడ్డాడు. గణేశ్ వాళ్ల అమ్మ, అన్నకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పాడు. స్వప్న వాళ్ళ కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్ అయిందని, ఆమెకి ఇప్పుడే చెప్పొద్దని నాతో చెప్పాడు. స్వప్న వాళ్ళ అమ్మది ఫోన్ నెంబర్ ఇంట్లో ఉందని, ఫోన్ చేయమని చెప్పి వెళ్లిపోయాడు. రోజు కనబడ్డప్పుడు మాట్లాడి వెళ్లిపోతుంటాడు. ఈరోజు కూడా అలాగే అనుకున్నాను. కానీ ఇంతలోనే దారుణం జరిగింది’ అని తెలిపారు.

Show comments