Crime News: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భార్య కట్టుకున్న భర్తను రోకలిబండతో కొట్టి చంపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో భర్త తుమ్మల వెంకట్ రెడ్డిని రోకలిబండ తో తల పై బాది భార్య రుక్మవ్వ హత్య చేసింది. తుమ్మల వెంకట్ రెడ్డి, రుక్మవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా ఒక కుమారుడు మరణించాడు. రెండవ కుమారుడు వేరే గ్రామంలో ఉంటున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరుగగా విసిగి పోయిన భార్య ఇంట్లో ఉన్న రోకలి బండతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అక్క బండ రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు రుక్మవ్వని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Read Also: BJP v/s MRPS: మహబూబ్ నగర్లో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఇది ఇలా ఉంటే.. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని పాళ్లూరులో అన్నదమ్ముల మధ్య భూ వివాదం హత్యకు దారితీసింది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు…పాళ్లూరుకి చెందిన రేషం బొమ్మయ్య, గొల్ల చిక్కీరప్ప, ఈరన్న, భీమప్ప, బొమ్మయ్య అన్నదమ్ములు. వీరికి పాళ్లూరులో 18 ఎకరాలు, కర్ణాటక రాష్ట్రంలోని కెంచగానిపల్లిలో 24 ఎకరాల భూములు ఉన్నాయి. రెండు నెలలుగా అన్నదమ్ముల మధ్య భూముల పంపకం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు పంచాయితీ చేసినా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తన వాటా భూమి తనకు ఇవ్వాలని గొల్ల చిక్కీరప్ప పాళ్లూరు భూమి వద్దకు సోమవారం వెళ్లాడు. అప్పటికే అక్కడ ఆయన తమ్ముడు గొల్ల బొమ్మయ్య, తమ్ముడి భార్య చిత్తక్క పనులు చేస్తున్నారు. ఇక నుంచి పొలం పనులు చేయొద్దని, తన భూమిని తనకు ఇచ్చేయాలని వారితో చిక్కీరప్ప గొడవ పెట్టుకున్నారు. దీంతో చిక్కీరప్పతో తమ్ముడు, తమ్ముడి భార్య గొడవ పడ్డారు. ఇద్దరూ కలిసి ఆయనను కిందకు తోసేసి కాళ్లతో తొక్కారు. దీంతో చిక్కీరప్ప ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: New Secretariat : కొత్త సెక్రటేరియట్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్