NTV Telugu Site icon

MGM Hospital : పేషెంట్‌ పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. భార్యను భుజాన మోసుకెళ్లిన భర్త..

Mgm Hospital

Mgm Hospital

వరంగల్ లోని ఎంజీఎం హస్పటల్ నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. పెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఈ ఎంజీఎం దవాఖానాలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఘటన ప్రస్తుతం తెలంగాణలో వైరల్‌ అవుతోంది. వృద్ధురాలైన ఓ పేషెంట్‌ పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలతో కర్కశకంగా వ్యవహరించారు. సదరు వృద్ధురాలికి కనీసం స్ట్రెచర్‌ కూడా ఇవ్వకపోవడంతో ఆమె భర్తే భుజాన వేసుకుని మోసుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది.

Also Read : Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

లక్ష్మి అనే వృద్ధురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినది. నెల రోజుల క్రితం ఎంజీఎం డాక్టర్లు ఆపరేషన్‌ చేసి అరిపాదం తొలగించారు. నెల తర్వాత లక్ష్మిని చెకప్‌ కోసం ఆమె భర్త ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే పెద్దసారు(కన్సల్ట్‌ డాక్టర్‌) లేరని, రేపు రావాలంటూ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. బయటకు వెళ్లేందుకు కనీసం స్ట్రెచర్‌ అయినా ఇవ్వాలని కోరినా.. సిబ్బంది దానికి నిరాకరించారు. దీంతో చేసేది లేక లక్ష్మిని ఆమె భర్త భుజాలపైకి ఎక్కించుకుని బయటకు మోసుకెళ్లాడు.

Also Read : Naga Chaitanya: కోలీవుడ్ డైరెక్టర్స్.. టాలీవుడ్ కు సెట్ కారా..?

అక్కడ ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియా గ్రూపుల్లో షేర్‌ చేడయంతో అది కాస్త వైరల్‌ గా మారింది. గతంలో ఇదే ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించిన పలు సమస్యలు వెలుగులోకి వచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా పేషెంట్లకు అందుతున్న వైద్యం మాత్రం మెరుగుపడడం లేదన్న విమర్శలు ఇప్పటికీ వస్తున్నాయి.

Also Read : Mumbai Metro : మాయా నగరిలో మార్కెట్‌ మాయాజాలం.. గమ్మత్తుగా మెట్రో స్టేషన్ల పేర్లు..

ఇక ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. ఎంజీఎంలో స్ట్రెచ్చర్‌ల కొరత లేదు.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించ లేదు.. అంటూ తెలిపారు. ఎవరో కావాలని ఎంజీఎం హస్పటిల్ ను బద్నాం చేసేందుకే పేషెంట్ ను భుజాలపై తీసుకుపొమ్మని ఆ పెద్దాయనకు చెప్పి వీడియో ను వైరల్ చేశారని అన్నారరు. వీడియో తీసిన అతనిపై కేసు పెడతాం. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. దీంతో పేషేంట్ ను మోసిన వృద్ధుడు మాత్రం ఎండలో తన భార్యను అలా వదిలేశారు.. సిబ్బందిని స్ట్రెచర్‌తో రమ్మంటే రాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అని ఆ పెద్దాయన చెప్పుకొచ్చారు.

Show comments