Site icon NTV Telugu

Karnataka: ఫేస్‌బుక్ లైవ్‌లో భర్త ఆత్మహత్యాయత్నం.. అంతా డ్రామా అన్న భార్య.. చివరకు

Karnataka

Karnataka

కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలు, అక్రమ సంబంధాలు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తున్నాయి. వేధింపులు తాళలేక క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ భర్త తన భార్య, ఆమె బంధువులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. భార్య మాత్రం అదంతా డ్రామా అని ఆరోపించింది. ఈ సంఘటన జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Also Read:Tumbad : తుంబాడ్ సీక్వెల్‌లో బాలీవుడ్ బ్యూటీ..!

సల్మాన్ పాషా అనే వ్యక్తి కువైట్‌లో హైడ్రాలిక్ మెకానిక్‌గా పనిచేసి భారత్ కు తిరిగి వచ్చాడు. అతను నాలుగు సంవత్సరాల క్రితం సయ్యద్ నిఖత్ ఫిర్దోస్‌ను వివాహం చేసుకున్నాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ జంట రెండేళ్లపాటు సంతోషంగా జీవించారు. కానీ సల్మాన్.. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

సల్మాన్ తన వీడియోలో తన భార్య, ఆమె కుటుంబం, ఆమె బంధువు, AIMIM తుమకూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బుర్హాన్ ఉద్దీన్ తనను మానసికంగా వేధించాడని, డబ్బు కోసం ఒత్తిడి చేశాడని ఆరోపించారు. తన భార్యకు బుర్హాన్ ఉద్దీన్ తో అక్రమ సంబంధం ఉందని, విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Also Read:Kicha Sudeep : బిగ్ బాస్ హౌస్ సీజ్.. కంటెస్టెంట్లను థియేటర్ కు తరలింపు

అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై సల్మాన్ కుటుంబం పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తర్వాత, సల్మాన్ భార్య సయ్యద్ నిఖత్ ఫిర్దోస్ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించారు. ఇది వరకు కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని తెలిపింది. సానుభూతి కొరకే ఇలా చేస్తున్నాడంటూ ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.

Exit mobile version