Man beats wife : ఈ మధ్య కాలంలో అకారణంగా భార్యభర్తలు చంపుకుంటున్నారు. చిన్న చిన్న వాటికే ఈగోలు పెంచుకుని చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. అన్నం వండలేదని భర్త కోపంలో భార్యను కొట్టి చంపాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం సంబల్ పూర్ జిల్లాలోని జమాన్కిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాది గ్రామంలో సనాతన్ ధారువాగా(40), పుష్ప ధారువాగా (35) ఇద్దరు దంపతులు, వారికి ఓ కుమార్తె, కొడుకు ఉన్నారు.
Read Also : TS Inter Results: నేడే ఇంటర్ ఫలితాలు విడుదల.. ఈ వెబ్ సైట్ కి వెళ్లి ఈజీగా తెలుసుకోండి
కుమార్తె కుచిందలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తుండగా, కుమారుడు ఆదివారం రాత్రి స్లీప్ ఓవర్ కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో సనాతన్ ఇంటికి తిరిగి వచ్చేసరికి పుష్ప కూర మాత్రమే వండింది. అన్నం వండలేదని సనాతన్ గుర్తించాడు. వెంటనే భార్యను నిలదీశాడు. చిన్న గొడవ కాస్త ముదిరి భార్యను చంపేవరకు వచ్చింది. ఈలోగా వారి కుమారుడు ఇంటికి వచ్చి చూడగా తల్లి శవమై కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also :Hanuman Chalisa Live: మంగళవారం హనుమాన్ చాలీసా వింటే..
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని భర్తను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. భర్తను అదుపులోకి తీసుకున్నట్లు జమాంకిరా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ జిత్ దాస్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.