‘హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026’ నివేదిక వెల్లడైంది. ఈ ఏడాది మన భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య బాగా పెరిగింది. నివేదిక ప్రకారం.. ఈసారి మన దేశంలో కొత్తగా 57 మంది కోటీశ్వరులు చేరారు. దీంతో మొత్తం సంఖ్య 308కి చేరింది. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా కోటీశ్వరులు ఉన్న మూడవ దేశంగా భారత్ నిలిచింది. మన దేశంలోని ఈ కోటీశ్వరులందరి ఆస్తి విలువ కలిపి సుమారు 112 లక్షల కోట్ల రూపాయలు.
ధనవంతుల జాబితాలో ఎవరు ముందున్నారు..?
ముఖేష్ అంబానీ: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఏడాది కూడా ఇండియాలోనే అత్యంత ధనవంతుడిగా, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన ఆస్తి 9.8 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది.
గౌతమ్ అదానీ: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 7.5 లక్షల కోట్ల రూపాయల ఆస్తితో రెండవ స్థానంలో ఉన్నారు.
రోష్ని నాడార్: హెచ్‌సిఎల్ సంస్థకు చెందిన రోష్ని నాడార్ మల్హోత్రా 3.2 లక్షల కోట్ల రూపాయల ఆస్తితో మూడవ స్థానంలో నిలిచారు. టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ ఆమెనే.
Also Read:Discounts On Gold: బంగారంపై భారీ డిస్కౌంట్లు.. భలే అవకాశం.. త్వరపడండి..
సైరస్ పూనావాలా: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా 44 శాతం ఆస్తి పెంచుకుని.. 3 లక్షల కోట్ల రూపాయలతో నాలుగవ స్థానానికి చేరుకున్నారు.
ఇండియాలో కోటీశ్వరులకు అడ్డా అంటే ఇప్పటికీ ముంబైనే. ముంబైలో 95 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ ఏడాది ముంబైలో కొత్తగా 15 మంది కోటీశ్వరులు వచ్చి చేరారు.
ఏ రంగాల్లో కోటీశ్వరులు పెరుగుతున్నారు..?
హెల్త్‌కేర్ (ఆరోగ్య రంగం)లో కొత్తగా 53 మంది కోటీశ్వరులు వచ్చారు. ఆ తర్వాత పారిశ్రామిక ఉత్పత్తులు, వినియోగ వస్తువుల రంగాల్లో కూడా మంచి వృద్ధి కనిపిస్తోంది. చిన్న వయసులోనే ఆస్తిని సంపాదించిన వారిలో ఓయో (OYO) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (32 ఏళ్లు) ఒకరు. ఆయన ఆస్తి 14,440 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరుల సంఖ్య తొలిసారిగా 4,000 దాటి 4,020కి చేరుకుంది. ఎలాన్ మస్క్ తన సంపదను ఏకంగా 89 శాతం పెంచుకుని, 792 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
Also Read:Kapil Dev: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై.. కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..
ఒకప్పుడు ఈ జాబితాలో ఉన్నవారిలో 80 శాతం మంది 10 ఏళ్ల క్రితం అసలు లేరంటే.. మన దేశంలో వ్యాపారాలు, సంపద సృష్టించే మార్గాలు ఎంత వేగంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దేశం ఇలాగే ముందుకు వెళ్తే.. త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతుందని ఈ నివేదిక చెబుతోంది.
