Bumper Discounts: పండుగ సీజన్‌లో తమకు నచ్చిన మొబైల్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేసే మంచి అవకాశం వచ్చేస్తోంది.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని డిస్కౌంట్ ధరలకు వివిధ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.. జనవరి 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ సేల్.. ఈ ఏడాది ఇది మొదటి అమెజాన్ సేల్.. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో పాటు.. బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్ డిస్కౌంట్లు మరియు ఇతర ప్రయోజనాలు కూడా ఉండనున్నాయి.. అయితే, ఈ సేల్ కు ముందే అమెజాన్ కొన్ని డీల్స్ ను ప్రకటించడం ప్రారంభించింది. ఇక్కడ, మీరు iPhone 15, OnePlus 15, Samsung Galaxy S25 Ultra సహా ఇతర టాప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.. మీరు ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్టు అయితే.. ఈ సేల్ ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు..
Read Also: Maruthi: చిరంజీవితో సినిమాపై డైరెక్టర్ మారుతి షాకింగ్ కామెంట్స్..
అమెజాన్ సేల్ సమయంలో మీరు ఐఫోన్ 15ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.59,900గా ఉన్న 128GB స్టోరేజ్ వేరియంట్ ఈ సేల్ సమయంలో రూ.50,249 వరకు అందుబాటులో ఉంటుంది. మీరు ఐఫోన్ 17 ప్రో సిరీస్ మరియు ఐఫోన్ ఎయిర్ లను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ.1,40,400కి లభిస్తుంది, అయితే ఇది రూ.1,49,900కి లాంచ్ అయింది. మరోవైపు, ఐఫోన్ 17 ప్రోను డిస్కౌంట్ తర్వాత రూ.1,25,400కి కొనుగోలు చేయవచ్చు. ఇక, అమెజాన్ సేల్ లో ఐఫోన్ ఎయిర్ కూడా డిస్కౌంట్‌తో లభిస్తుంది. రూ.99,900 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్.. ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత రూ.91,249 ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ధర వద్ద, ఈ స్మార్ట్‌ఫోన్ ఒక గొప్ప ఎంపికగా చెప్పవచ్చు..
వీటితో పాటు, OnePlus 15ను రూ. 68,999కు, Nord 5 ను రూ. 30,999 కు, మరియు OnePlus 15R ను రూ. 44,999కు కొనుగోలు చేసే అవకాశం వచ్చేసింది.. Samsung Galaxy A55 రూ. 23,999 కు లభిస్తుంది. Galaxy S25 Ultra ఈ సేల్ లో రూ. 1,19,999 కు లభిస్తుంది. ఈ సేల్ సమయంలో మీరు iQOO 15 ను రూ.65,999 కు కొనుగోలు చేయవచ్చు. Lava Bold N1 Pro, Galaxy M17, iQOO Z10R 5G, Redmi A4 5G, iQOO Neo 10 5G సహా ఇతర ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి.. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. ఫోన్ కొనే ప్లాన్ ఉంటే.. ఇదే మంచి అవకాశం..
