Site icon NTV Telugu

Humayun’s Tomb collapse: సమాధి చూడటానికి వెళ్తే.. ఢిల్లీలో ఘోరం.. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారంటే..?

06

06

Humayun’s Tomb collapse: దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని హుమాయున్ సమాధి ప్రాంగణంలో ఉన్న ఒక దర్గా పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10-12 మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేశారు.

READ MORE: Ambati Rambabu: సూపర్ సిక్స్, సూపర్ ప్లాప్.. చంద్రబాబుపై అంబటి ఫైర్

దర్గా దగ్గర ప్రమాదం..
ఈ ప్రమాదం హుమాయున్ సమాధి వెనుక ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. హుమాయున్ సమాధి వెనుక ఉన్న దర్గా పైకప్పు కూలిపోయింది. ప్రమాదంలో శిథిలాల కింద10-12 మంది చిక్కుకున్నారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అధికారులు చేపట్టిన రక్షణ చర్యల్లో 12 మందిని సురక్షితంగా తరలించారు.

అంతర్జాతీయ మీడియా సంస్థతో ఢిల్లీ అగ్నిమాపక దళ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గోపురంలోని ఒక భాగం కూలిపోతున్నట్లు సమాచారం అందిందని, ఆ తర్వాత సైనికులను సంఘటనా స్థలానికి పంపించాం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా రాజధానిలో నిరంతరం కురుస్తున్న వర్షం కారణంగా ఈ పాత భవనం పైకప్పు కూలిపోయి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. శిథిలాల కింద సుమారుగా 8 నుంచి 10 వ్యక్తులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని, ఐదు అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపినట్లు ఆయన తెలిపారు. 16వ శతాబ్దం మధ్యకాలం నాటి హుమాయున్ సమాధిని తరచుగా పర్యాటకులు సందర్శిస్తారు. ఈ ప్రమాదంలో కొంతమంది మరణించినట్లు కూడా నివేదికలు ఉన్నాయి.

READ MORE: JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?

Exit mobile version