Site icon NTV Telugu

Human trafficking: మానవ అక్రమ రవాణా కలకలం.. రూ.10 వేలకు మైనర్ బాలికను అమ్మేశారు

Arrest

Arrest

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మానవ అక్రమ రవాణా కలకలం రేపుతోంది. ఇటీవల కొమురం భీమ్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసులో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికను అమ్మేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిని పక్క రాష్ట్రానికి అమ్మిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్ కోటా ఏరియాలో ముఠా సభ్యులు మైనర్ ని అమ్మేసింది. మైనర్ బాలికను రూ.10 వేలకు అమ్మేశారు ఇద్దరు వ్యక్తులు. అమ్మాయిని అమ్మిన కేసులో నిర్మల, బావున్యను అరెస్టు చేసినట్లు గా డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

Exit mobile version