Site icon NTV Telugu

Indore Airport: ఇండోర్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మానవ అస్థిపంజరం..

Indore Airport

Indore Airport

Indore Airport: మధ్యప్రదేశ్‌లో ప్రముఖ పట్టణమైన ఇండోర్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ అస్థిపంజరం కలకలం రేపింది. ఇండోర్‌లోని దేవి అహల్యా బాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో మానవ అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Air India: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.10లక్షల జరిమానా

సోమవారం రాత్రి ఇండోర్ విమానాశ్రయ ప్రాంగణంలో ఒక మానవ అస్థిపంజరం స్వాధీనం చేసుకున్నామని ఏరోడ్రోమ్ పోలీసు ఇన్‌ఛార్జ్ సంజయ్ శుక్లా వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) పరీక్షకు పంపనున్నామని ఆయన చెప్పారు. ప్రాథమిక విచారణలో ఆ అస్థిపంజరం ఏడాది వయస్సు ఉంటుందని పోలీసు అధికారి తెలిపారు. అస్థిపంజరం మగవాడా లేదా ఆడదా అని తాము చెప్పలేమన్నారు. ఆ అవశేషాలను పరీక్షకు పంపుతామన్నారు.

Exit mobile version