NTV Telugu Site icon

లక్షా 20 ఏళ్ల క్రితమే…!!

ఆఫ్రికా ప్రాంతం నుంచి మనిషి వివిధ ప్రాంతాలకు విస్తరించారు.  సుమారు లక్షా 20 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్స్ సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతంలో సంచరించిన విషయాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.  శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ భారీ అడుగులు మనిషికి సంబంధించినవే అని అంటున్నారు.  సౌదీ అరేబియాలోని నిపుడ్ ఎడారిలో ఈ అడుగులను గుర్తించారు.  ఎడారి ప్రాంతంలో ఒంటెలను ఇతర జంతువులను వేటాడే క్రమంలో అటువైపు వచ్చి ఉంటారని పరిశోధకులు చెప్తున్నారు.  అరేబియా ప్రాంతంలో గుర్తించిన నిజమైన పాదముద్రలు ఇవే అని పరిశోధకులు స్పష్టం చేశారు.