Site icon NTV Telugu

Telangana Forest Department : అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు

Telangana Forest Department

Telangana Forest Department

Huge Transfers in Telangana Forest Department

అటవీశాఖలో భారీగా అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది ఐఎఫ్ఎస్‌లు, 8 మంది డీఎఫ్ఓలను బదిలీలతో పాటు పోస్టింగ్‌ చేసింది ప్రభుత్వం. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్. పంచాయితీరాజ్ శాఖ జాయింట్ కమిటిషనర్ గా (డీసీఎఫ్) ప్రదీప్ కుమార్ షెట్టి. ఫారెస్ట్ అకాడమీలో డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) గా ప్రవీణ. సిద్దిపేట డీఎఫ్ఓగా కే.శ్రీనివాస్. హన్మకొండ, జనగామ డీఎఫ్ఓగా జే.వసంత. ములుగు డీఎఫ్ఓగా కిష్టాగౌడ్. యాదాద్రి భువనగిరి డీఎఫ్ఓగా పద్మజారాణి. నిజామాబాద్ డీఎఫ్ఓగా వికాస్ మీనా. రంగారెడ్డి డీఎఫ్ఓగా జాదవ్ రాహుల్ కిషన్. నాగర్ కర్నూల్ డీఎఫ్ఓగా జీ. రోహిత్. మంచిర్యాల డీఎఫ్ఓగా శివ్ ఆశీష్ సింగ్.

 

ఖమ్మం డీఎఫ్ఓగా సిద్దార్థ్ విక్రమ్ సింగ్. సంగారెడ్డి డీఎఫ్ఓగా సీ. శ్రీధర్ రావు. చార్మినార్ సర్కిల్ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓగా వీ. వెంకటేశ్వర రావు. మున్సిపల్ శాఖ అడిషనల్ డైరెక్టర్ గా ఎం.అశోక్ కుమార్. అమనగల్ ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా వేణుమాధవ రావు. వికారాబాద్ డీఎఫ్ఓగా డీవీ రెడ్డి. సూర్యాపేట డీఎఫ్ఓగా వీ. సతీష్ కుమార్. సూర్యాపేట డీఎఫ్ఓ ముకుంద్ రెడ్డి బదిలీ, ఎక్సయిజ్ శాఖలో డీసీఎఫ్ గా నియామకం కాగా.. అరణ్య భవన్ లో డీసీఎఫ్ (ఐటీ) గా శ్రీలక్ష్మి నియమించారు.

 

Exit mobile version