NTV Telugu Site icon

RC 16 : రాంచరణ్ సినిమా కోసం భారీ సెట్ నిర్మాణం ..

Rc 16

Rc 16

RC 16 : గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ”గేమ్ ఛేంజర్”అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో  కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించిన దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.గేమ్ ఛేంజర్ సినిమా తరువాత రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బచ్చిబాబు సన డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

Read Also :Kalki 2898 AD : పాపులర్ మీమ్స్ తో కల్కి యానిమేషన్ సిరీస్ ను నింపేసారుగా..

ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించిన కూడా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.జూన్ లో రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.అయితే ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.వృద్ధి సినిమాస్,మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను దర్శకుడు బుచ్చి బాబు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లు లో మూవీ యూనిట్ ఓ భారీ సెట్ నిర్మిస్తున్నట్లు సమాచారం.సాంగ్స్ షూటింగ్ తో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.ఈ సినిమాకు ఏ.ఆర్ .రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.