NTV Telugu Site icon

Kartika Purnima : శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు

Karthika Paurnima

Karthika Paurnima

Karathika Purnima : హిందూ సంప్రదాయంలో కార్తీక పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పౌర్ణమినే త్రిపరి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు లయకారుడు శివుడు త్రిపురాసురుడిని సంహరించాడన్నది పురాణ గాధ. అయితే.. అప్పటి నుంచి శంకరుడిని త్రిపురారి అని కూడా పిలుస్తారు. ఈ సారి కార్తీక పూర్ణిమ నవంబర్‌ 8 మంగళవారం ఉంది. అయితే.. అదే రోజున చంద్రగ్రహణం ఉండటంతో దేవాలయాలను మూసివేయనున్నారు. దీంతో ఒకరోజు ముందుగానే కార్తీక పౌర్ణమి జరుపుకుంటున్నారు భక్తులు. అయితే.. గత నెలలో దీపావళి రోజున సూర్యగ్రహణం రావడంతో.. ఒకరోజు ముందుగానే వేద పండితులు సూచనల మేరకు దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇప్పుడు కార్తీక పౌర్ణమ నాడు చంద్రగ్రహణం రావడంతో.. ఒక రోజు ముందుగానే శైవక్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తోంది. అయితే.. కార్తీక పౌర్ణమితో పాటు సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. దీంతో.. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.

Also Read :Gujarat : బీజేపీకి షాక్‌.. పార్టీకి మాజీ మంత్రి గుడ్‌బై..

అయితే.. ప్రకాశం జిల్లాలో కార్తీక సోమవారం సందర్భంగా శైవాలయాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. త్రిపురాంతకం, భైరవకోన, సోపిరాల, ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి, పొదిలి శ్రీ నిర్మామహేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బాపట్లలో వేటపాలెం నాయనిపల్లిలో శ్రీగంగా పార్వతీ సమేత బోగలింగేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ్టి నుంచి స్వామి వారిని నేరుగా సూర్యకిరణాలు తాకనున్నాయి. వారం రోజులపాటు స్వామి వారిని తాకనున్నాయి సూర్యకిరణాలు. దీంతో.. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

Also Read : Karthika Somavaram : రెండవ కార్తిక సోమవారం నాడు ఈ స్తోత్రం వింటే మీ బాధలు కష్టాలు ఇట్టే తొలగిపోతాయి
కాకినాడలో కార్తీక సోమవారం సందర్బంగా పంచారామాలు వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ద్రాక్ష రామము, కుమార రామము భీమేశ్వర స్వామి దేవస్థానాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున నుంచి అభిషేకాలతో పాటు భక్తుల ప్రత్యేక పూజలు, శివనామస్మరణలతో శైవాలయాలు మార్మోగుతున్నాయి.

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులు రద్దీ నెలకొంది. కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామునుంచి వ్రతాలు సర్వ దర్శనాలకు భక్తులు తరలవస్తున్నారు. కార్తీక పౌర్ణమి కావడంతో రాజమండ్రిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి స్నానఘట్టాలు.. వేలాదిగా తరలివచ్చి గోదావరిలో కార్తీక స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, భక్తుల పుణ్య స్నానాలతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్ లు కిక్కిరిసిపోయాయి. స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో గోదావరి నదిలో భక్తులు కార్తీక దీపాలు వదులుతున్నారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Also Read : Health Tip: సీతాఫలంతో.. మగవారి నరాల బలహీనతకు చెక్‌

తూర్పుగోదావరి జిల్లాలో నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదికి ప్రత్యేక హారతి నిర్వహించనున్నారు. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరీ నిత్యహారతిలో భాగంగా ప్రత్యేకంగా పౌర్ణమి హారతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా.. అనంతపురం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మొదటి రోడ్డు కాశీ విశ్వేశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. శివకోటిలో ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.

తిరుపతిలో కార్తీక సోమవారం సందర్బంగా శ్రీకాళహస్తి, కపీలతీర్దం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచి అభిషేకాలతో పాటు భక్తుల ప్రత్యేక పూజలు, శివనామస్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. గుంటూరులోని అమరావతి కృష్ణా నది తీరాన నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిహారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమరావతిలో కృష్ణానది తీరాన నేడు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో నేడు కార్తీక పౌర్ణిమ పురస్కరించుకొని శివాలయాలలో కృతికోత్సవం ఏర్పాటు చేశారు. దీంతోపాటు.. హిందూపురం పట్టణంలోని యల్లమ్మ దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పూలపల్లకి ఉత్సవం, లక్షదీపోత్సవం, జ్వాలాతోరణం నిర్వహించనున్నారు.