Site icon NTV Telugu

Naga Statues: కృష్ణానదిలో నాగదేవత విగ్రహాలు.. ప్రతిమలు ఎలా వచ్చాయని ఆరా

Naga Statues

Naga Statues

కృష్ణానదీ తీరంలో నాగ ప్రతిమలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి సమీపంలో కృష్ణానది కరకట్ట దిగువన నాగ ప్రతిమలు పదుల సంఖ్యలో కనబడుతున్నాయి. సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలీదుగానీ భారీగా వెలుగు చూశాయి.

Read Also: Karthika Deepam: ‘కార్తీక దీపం’ సీజన్ 2.. వంటలక్క ఫ్యాన్స్ రెడీనా.. ?

దాదాపు 50కి పైగా నాగ దేవతల విగ్రహాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ఇవి నీటినుంచి బయటపడ్డాయా? లేక ఎవరన్నా తెచ్చి ఇక్కడ పెట్టిపోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విగ్రహాలు ఉన్నచోట ఓ వ్యక్తి జపం చేసి వెళ్తున్నాడనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. అసలు ఈ విగ్రహాలు అక్కడకు ఎలా వస్తున్నాయి? నది నీటి ప్రవాహం నుంచి కొట్టుకొచ్చాయా? కొట్టుకొచ్చినట్లైతే అన్నీ ఒక్కచోటే ఎందుకు ఆగుతాయి? లేదా ఎవరైనా కావాలనే వీటిని ఇక్కడకు తీసుకొచ్చి వదిలి పెడుతున్నారా? అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.

Read Also: India vs China: స్మార్ట్ ఫోన్లే కాదు.. తయారీ విషయంలో చైనాను అధిగమిస్తున్న భారత్..!

అయితే, ఈ ఏరియాలో ఓ వ్యక్తి నిత్యం జపం చేసి వెళ్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్న క్రమంలో ఆ వ్యక్తి ఎవరు? ఇక్కడికే వచ్చి ఎందుకు జపం చేస్తున్నాడు? ఈ విగ్రహాల వెనుక ఏ కథ దాగుంది? అనే పలు డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విగ్రహాల మిస్టరీని అధికారులు ఎలా చేధిస్తారో అనేది వేచి చూడాలి. నాగ ప్రతిమల విగ్రహాలు చాలా శక్తివంతమైనవని, వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని, దోషాలు చుట్టుకుంటాయని స్థానికులు అంటున్నారు. ఆ భయం కొద్దే ఇలా నదిలో విగ్రహాలు వదిలి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. ఈ విగ్రహాలు ఎప్పటివో తెలియాలంటే వీటిపై పరిశోధన జరగవలిసిన అవసరం ఉంది. కృష్ణ నది లోతులలో మరిన్ని విగ్రహాలు వుండే అవకాశం వున్నట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

Read Also: Assistant Collector: ఏపీ సీఎంను కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌.. ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పిన జగన్

ఈ నాగ ప్రతిమలు దెబ్బతిని ఉండటం..ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తొలగిస్తే నదిలో కలిపే సంప్రదాయం ఉండటం.. వీటిని నీటి ఒడ్డున వదిలివెళ్లి ఉంటారని అనుమానాలు నివృతం కావాల్సి ఉంది. గతంలో కూడా ఇటువంటి ఘటనలే జరిగాయని.. పశ్చిమ డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నాగదేవత ప్రతిమలను వదిలివెళ్లినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి కూడా అదే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version