రైల్వేలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో మొత్తం 4,660 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు : 4,660
కానిస్టేబుల్ పోస్టులు: 4,208
సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 452
అర్హతలు..
కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసేవారు పదోతరగతి పాసై ఉండాలి.. అదే విధంగా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి..
వయసు…
01.07.2024 నాటికి కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి..
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు రూ.21,700, ఎస్ఐ పోస్టులకు రూ.35,400 వరకు చెల్లిస్తారు..
ఎంపిక విధానం..
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు..
దరఖాస్తు ఫీజు..
ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. మిగిలివారికి రూ. 500 గా ఉంది..
దరఖాస్తు విధానం..ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది..
ఈ పోస్టులపై ఆసక్తి, అర్హతలు కలిగిన వారు రైల్వే వెబ్ సైట్ https://rpf.indianrailways.gov.in/RPF లో చూడవచ్చు.. మరింత సమాచారాన్ని తెలుసుకొని అప్లై చేసుకోవడం మంచిది..