NTV Telugu Site icon

CIL Recruitment 2024: కోల్ ఇండియా లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు..జీతం ఎంతంటే ?

Jobbss

Jobbss

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కోల్ ఇండియా లిమిటెడ్ లో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 34 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు.. 34..

సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌-26, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌-08..

విభాగాలు..

డెర్మటాలజిస్ట్, పల్మాలజిస్ట్, చెస్ట్‌ స్పెషలిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్, జీడీఎంవో, డెంటిస్ట్‌ తదితర పోస్టులు..

అర్హతలు..

జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌ అండ్‌ పల్మనరీ మెడిసిన్, ఎంబీబీఎస్, పీజీ, బీడీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి..

జీతం..

ఒక్కో పోస్టుకు ఒక్కో జీతం ఉంటుంది.. నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000, మెడికల్‌ స్పెషలిస్ట్, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు..

వయసు..

ఈ పోస్టులకు అప్లై చేసేవాళ్ళకు 31.01.2024 నాటికి 35 నుంచి 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును ఆఫీస్‌ ఆఫ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్, రిక్రూట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్, ఎన్‌సీఎల్‌హెచ్‌క్యూ, సింగ్రౌలీ(మధ్యప్రదేశ్‌) చిరునామకు పంపించాలి..

చివరితేది 11.04.2024..

ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ https://www.nclcil.in/ లో చూడవచ్చు..