NTV Telugu Site icon

Railway Jobs: పది అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Railway Jobs

Railway Jobs

రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా ప్రభుత్వం భారీగా రైల్వేలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. అర్హత ఉన్న అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ చెక్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు మే 1తో ముగుస్తుంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1113 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ పోస్టుల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య.. 1113

పోస్టుల వివరాలు..

రాయ్‌పూర్ డివిజన్‌ పరిధిలోని DRM ఆఫీస్‌లో 844 ఖాళీలు, రాయ్‌పూర్‌లోని వాగన్ రిపేర్ షాప్‌లో 269 ఖాళీలు, వాగన్ రిపేర్ షాప్ పోస్టుల్లో ఫిట్టర్- 110, వెల్డర్- 110, మెషినిస్ట్- 15, టర్నర్- 14, ఎలక్ట్రీషియన్- 14, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామర్ అసిస్టెంట్- 4, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)- 1, స్టెనోగ్రాఫర్(హిందీ)- 1 పోస్టు భర్తీ కానున్నాయి.. ఇంకా పలు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..

అర్హతలు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు పదో తరగతిలో కనీసం మార్కులతో పాసై ఉండాలి. లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి..

వయసు..

అభ్యర్థుల వయసు కనీసం 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి..

ఎంపిక ప్రక్రియ..

మెట్రిక్యులేషన్ ITI పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ధ్రువపత్రాల వెరిఫికేషన్ సమయంలో మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటిస్ గా పని చేయాల్సి ఉంటుంది..

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 02.02 2024
దరఖాస్తులకు చివరి తేదీ: 01. 05. 2024
అధికారిక వెబ్ సైట్:https://secr.indianrailways.gov.in/

అభ్యర్థులు ఏవేని సందేహాలుంటే 7024149242 చేసి తెలుసుకోవచ్చు..