పోస్టాఫీస్ లో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 27 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి.. వెంటనే అప్లై చేసుకోండి.. ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు..27
ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలు భర్తీ చేయబడతాయి..
వయోపరిమితి..
పదో తరగతి పాసైన విద్యార్థులు అర్హులు.. ఇక దరఖాస్తుదారుడి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.. నోటిఫికేషన్ ను చూసి అప్లై చేసుకోవచ్చు..
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం ఇవ్వబడుతుంది.. ఇంకా బోనస్ లు కూడా వస్తాయి..
దరఖాస్తు ప్రక్రియ..
ఈ పోస్టులకు అప్లై చేసేవాళ్ళు ఆఫ్ లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు – 560001..
ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు..