Site icon NTV Telugu

Gold Rate Today: షాకిచ్చిన బంగారం ధరలు.. ఊహించని రీతిలో పెరిగాయ్!

Gold Price Today

Gold Price Today

కొనుగోలు దారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి. వరుస రెండు రోజులు స్థిరంగా ఉండి, ఆపై రెండు తగ్గిన గోల్డ్ రేట్లు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.850.. 24 క్యారెట్లపై రూ.920 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్‌లో బుధవారం (జనవరి 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,950గా.. 24 క్యారెట్ల ధర రూ.82,850గా నమోదైంది. రేట్స్ భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు గోల్డ్ కొనాలంటే వెనకడుగు వేస్తున్నారు.

మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండోరోజు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. గత 10 రోజుల్లో వెండిపై వెయ్యి పెరగగా.. అంతే మొత్తంలో తగ్గింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష నాలుగు వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.96,500గా కొనసాగుతోంది.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.75,950
విజయవాడ – రూ.75,950
ఢిల్లీ – రూ.76,100
చెన్నై – రూ.75,950
బెంగళూరు – రూ.75,950
ముంబై – రూ.75,950
కోల్‌కతా – రూ.75,950
కేరళ – రూ.75,950

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.82,850
విజయవాడ – రూ.82,850
ఢిల్లీ – రూ.83,000
చెన్నై – రూ.82,850
బెంగళూరు – రూ.82,850
ముంబై – రూ.82,850
కోల్‌కతా – రూ.82,850
కేరళ – రూ.82,850

Also Read: Varun Chakravarthy: చాలా బాధగా ఉంది.. ఆవేదన వ్యక్తం చేసిన టీమిండియా స్పిన్నర్!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,04,000
విజయవాడ – రూ.1,04,000
ఢిల్లీ – రూ.96,500
ముంబై – రూ.96,500
చెన్నై – రూ.1,04,000
కోల్‎కతా – రూ.96,500
బెంగళూరు – రూ.96,500
కేరళ – రూ.1,04,000

Exit mobile version