Site icon NTV Telugu

హైదరాబాద్ అంబర్ పేట్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ అంబర్ పేట్ లోని పాత పుస్తకాల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది… సుమారు ఒంటి గంట ప్రాంతంలో షాపులో మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు… సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసారు… పుస్తకాలు షాపు కావడంతో మంటలను అదుపుచేయటం ఫైర్ సిబ్బందికి కష్టతరం అయింది..

దీపావళి టపాసుల వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇది ఇలా ఉండగా.. అటు హైదరాబాద్‌లో దీపావళి వేడుక విషాదాన్ని మిగిల్చింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కందికల్ గేట్ దగ్గర క్రాకర్స్ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవ్యక్తిని చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. మృతులు వీరందర్‌ కుమార్, జగన్నాథ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version