Noida Fire : నోయిడా మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noida Fire : నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని లాజిక్స్ మాల్‌లో అగ్నిప్రమాదం కారణంగా గందరగోళ వాతావరణం నెలకొంది. మంటలు చెలరేగిన వెంటనే మాల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. మంటలు వ్యాపించక ముందే ప్రజలు బయటకు వచ్చారు. మాల్‌లోని ఓ దుస్తుల షోరూమ్‌లో మంటలు చెలరేగడంతో మాల్ మొత్తం పొగతో నిండిపోయింది. ప్రస్తుతం పలు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Read Also:Noida Fire : నోయిడా మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం
Also Read
నోయిడాలోని సెక్టార్ -24 పోలీస్ స్టేషన్ పరిధిలోని లాజిక్స్ మాల్ లోపల ఉన్న ఒక బట్టల షోరూమ్‌లో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ సెక్టార్ 24 పోలీస్ ఫోర్స్, అగ్నిమాపక దళం వాహనాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. మాల్‌లో పొగలు కమ్ముకోవడంతో అందరినీ బయటకు పంపించేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
Read Also:Raj Tarun: బ్రేకింగ్: ప్రేమించి మోసం చేశాడు..రాజ్ తరుణ్ పై లవర్ పోలీస్ కేసు
ప్రస్తుతం మాల్ లోపల ఎవరూ చిక్కుకోలేదు. మాల్‌లో పొగలు కమ్ముకోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తొలిదశలో మంటలను ఆర్పేందుకు మాల్ యాజమాన్యం ప్రయత్నించగా, మంటల పరిధి పెరగడంతో పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఇంకా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మాల్ బయట పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!