NTV Telugu Site icon

Fire Accident: దుగ్గిరాలలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానిక ప్రజలు

Fire Accident

Fire Accident

Fire Accident: గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో ఓ పసుపు కోల్డ్ స్టోరేజ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీ ఎత్తున వ్యాపించిన మంటల వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్‌లో ఎగిసిపడుతున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Read Also: Gidugu Rudraraju: ఎల్లుండి పీసీసీ చీఫ్‌గా షర్మిలకు బాధ్యతలు.. కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు!

దగ్గరలో ఉన్న మరిన్ని ఫైర్ ఇంజన్లను తేప్పించే ప్రయత్నం అధికారులు చేపట్టారు. అయితే ఆస్తి నష్టం కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్నికీలలూ పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం అంచనా చేసే అవకాశం ఉంది. స్థానిక రెవెన్యూ అధికారులు అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.