NTV Telugu Site icon

Ravi Basrur: టైగర్ స్టూడియోకి వస్తేనే ఇలా ఉంటే.. ఇక ఎన్టీఆర్-నీల్ సినిమా షేక్ అవ్వాల్సిందే!

Ntr Ravi Basrur

Ntr Ravi Basrur

Ravi Basrur Compose Music Bit For NTR: ‘కేజీఎఫ్’ సినిమా చూసిన వారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, పాటలను అంత ఈజీగా మరిచిపోలేరు. ప్రస్తుతం వస్తున్న ఏ యాక్షన్ ఫిల్మ్ తీసుకున్నా సరే.. కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను బీట్ చేయలేకపోతున్నాయి. ఇక సలార్ సినిమా బీజీఎం విషయంలో ముందుగా అంత బాగాలేదనే టాక్ వినిపించింది కానీ ఇప్పుడు ఆ మ్యూజిక్ వింటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చింది ‘రవి బస్రూర్’. ఈయనే ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ చేయబోతున్న తర్వాతి సినిమాకు కూడా రవినే మ్యూజిక్ డైరెక్టర్.

కేజీఎఫ్, సలార్ సినిమాలకే ఆ రేంజ్ మ్యూజిక్ ఇస్తే.. ఇక ఎన్టీఆర్ సినిమాకు ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేరు. ఎందుకంటే ఇది ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే రవి విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు శాంపిలే తాజాగా ఎన్టీఆర్ కోసం రవి కంపోజ్ చేసిన మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రవి మ్యూజిక్ స్టూడియోను తారక్ విజిట్ చేశాడు. టైగర్ ఫస్ట్ టైం తన స్టూడియోలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తన సంతోషాన్ని పాటగా మార్చి ఎన్టీఆర్‌కు గిఫ్టుగా ఇచ్చాడు రవి. ‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అనే స్పెషల్ సాంగ్ కంపోజ్ చేశాడు.

Also Read: Singer Mano Sons: సింగర్ మనో కుమారులపై కేసు నమోదు.. గాలిస్తున్న చెన్నై పోలీసులు!

ప్రస్తుతం రవి కంపోజ్ చేసిన సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటలో ఎన్టీఆర్ తన స్టూడియోని సందర్శించిన విజువల్స్‌ చూపించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపాడు. అయితే టైగర్ స్టూడియోకి వస్తేనే ఈ రేంజ్ ఎలివేషన్ సాంగ్ ఇచ్చాడంటే.. ఇక సినిమాకు ఇచ్చే మ్యూజిక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్-నీల్ సినిమా షేక్ అవ్వాల్సిందే అని ఫాన్స్ అంటున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Show comments