NTV Telugu Site icon

HMDA: రికార్డు స్థాయి ధర పలికిన కోకాపేట భూములు.. ఎకరం రూ.72 కోట్లు

Hmda Lands

Hmda Lands

HMDA: కోకాపేటలోని నియో పోలిస్ ఫేజ్‌-2లో భూములు రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలస్‌లో హెచ్‌ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా ధరను నిర్ణయించగా.. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 72 కోట్లు.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికింది. అయితే ఈరోజు ఉదయం తొలి విడతలో చేపట్టిన 6,7,8,9 ఫ్లాట్ల వేలం ముగియగా.. ఫ్లాట్లు అంచనాలకు మించి ధర పలికాయి. నాలుగు ప్లాట్ల వేలంలో అత్యధికంగా ఒక ఎకరం దాదాపు రూ. 72 కోట్లు పలకగా.. అత్యల్పంగా రూ. 51 కోట్లు పలికింది. గజం సరాసరి రూ. 1.5 లక్షలు పలికింది. మొత్తంగా నాలుగు ప్లాట్ల వేలంలో హెచ్‌ఎండీఏకు రూ. 1,532.5 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.

Also Read: CM KCR: టీఎన్జీఓలు, టీజీఓల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఇక, ప్రస్తుతం 10,11,14 ప్లాట్లకు వేలం కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 18.47 ఎకరాలకు వేలం నిర్వహించనున్నారు. వేలం జరుగుతున్న ప్లాట్లకు కూడా భారీగా ధర పలికే అవకాశం ఉంది. గతంలో 2021 జూలైలో నియోపోలిస్ ఫేజ్ 1 వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ. 60 కోట్లను తాకింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,000 కోట్లు సంపాదించింది. ఫేజ్‌ 1లో దాదాపు 49 ఎకరాలు విక్రయించగా.. ఎకరం అప్‌సెట్ ధరను 25 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈరోజు జరిగే వేలం ద్వారా మరో రూ. 2,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

మొత్తం వేలం ద్వారా సమకూరిన ఆదాయం ఇలా..

*7 ఎకరాల ప్లాట్‌కు ఎకరాకు 57.25 కోట్లు….400.75 కోట్లు

*6.55 ఎకరాల ప్లాట్ కు ఎకరాకు 56.50 కోట్లు… మొత్తం 379.070 కోట్లు

*9.71 ఎకరాల ప్లాట్ కు ఎకరానికి 51.75 కోట్లు… మొత్తం 502.49 కోట్లు

*3.6 ఎకరాల ప్లాట్ కు ఎకరానికి 72 కోట్లు.. మొత్తం 259.2 కోట్లు

మొత్తం 1532.5 కోట్ల ఆదాయం

Show comments