NTV Telugu Site icon

Huawei Nova 11 SE Price: హువావే నుంచి మరో సూపర్ స్మార్ట్‌ఫోన్.. 108 ఎంపీ కెమెరా, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ!

Huawei Nova 11 Se Price

Huawei Nova 11 Se Price

Huawei Nova 11 SE 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘హువావే’ ఎప్పటికప్పుడు భారత మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తుంటుంది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా బడ్జెట్ ధరలో ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను హువావే రిలీజ్ చేస్తోంది. అదే ‘హువావే నోవా 11 ఎస్‌ఈ’ స్మార్ట్‌ఫోన్‌. చైనా మార్కెట్‌లో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్‌.. త్వరలోనే భారత మార్కెట్‌లోకి రానుంది.

Huawei Nova 11 SE Price:
హువావే 11 సిరీస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో ప్రారంభించబడింది. ఈ లైనప్‌లో మూడు ఫోన్‌లు (హువావే నోవా 11, హువావే నోవా 11 ప్రో మరియు హువావే నోవా 11 అల్ట్రా) ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ హువావే నోవా 11 ఎస్‌ఈ లాంచ్‌తో సిరీస్‌లో మరో మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రీ ఆర్డర్‌లు ఇప్పటికే చైనాలో ఆరంభమయ్యాయి. ఈ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్ ధర రూ. 23,000 కాగా.. 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,000గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగులలో (నలుపు, ఆకుపచ్చ మరియు తెలుపు) అందుబాటులో ఉంది.

Huawei Nova 11 SE Specs:
హువావే నోవా 11 ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌ డ్రాగన్‌ 680 ఎల్‌టీఈ ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించారు. ఎల్‌టీఈ ఎస్వోసీ విత్ 2.4 గిగా హెర్ట్జ్ సీపీయూతో ఇది పనిచేయనుంది. హార్మోనీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 4 వెర్షన్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచెస్‌ ఫ్లాట్‌ ఓఎల్‌ఈడీ ప్యానెల్ డిస్‌ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇందులో అమర్చారు.

Also Read: Afghanistan Semi Final Chances: సెమీస్ రేసు రసవత్తరం.. అఫ్గానిస్థాన్‌కు ఇంకా ఛాన్స్ ఉందా?

Huawei Nova 11 SE Camera and Battery:
హువావే నోవా 11 ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. వెనకాల 108 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరాలను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన కెమెరా ఉంటుంది. హువావే నోవా 11 ఎస్‌ఈలో 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. ఇది 66 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Huawei Nova 11 Se

Show comments