Site icon NTV Telugu

HrithikRoshan : కొడుకులతో కలిసి డాన్స్ అదరగొట్టిన హృతిక్ రోషన్.. వీడియో వైరల్

Hrithk Roshan

Hrithk Roshan

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, తన ఇద్దరు పిల్లలతో కలిసి కజిన్ ఈషాన్ రోషన్ పెళ్లి వేడుకలో ‘ఓ హో హో హో సాంగ్ కు చేసిన  డాన్స్ చేసిన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్యూట్ ఫ్యామిలీ మోమెంట్‌ను హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. వీడియోలో ఆయన ఇద్దరు పిల్లలు, హ్రీహాన్ మరియు హ్రిదాన్‌తో కలిసి  డాన్స్ చేస్తున్నారు.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

ఈ ప్రత్యేక క్షణంలో, హృతిక్ రోషన్ బ్లాక్ క్లోథింగ్‌లో డ్యాన్సు చేస్తుండగా, ఆయన పిల్లలు తెలుపు మరియు బ్లాక్ రంగుల్లో మెరిసిపోయారు. మ్యూజిక్‌ మరియు ఈ అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులే కాకుండా, వారి మధ్య చూపించిన ప్రేమ కూడా ఈ వీడియోను కలర్ ఫుల్ గా మార్చింది. ఈ హ్యాపీ మూమెంట్ ను హృతిక్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో   ” అయ్యో వారితో ( పిల్లలు)తో పాటు డాన్స్ చేయాలంటే నేను నా అడుగులును ఇంకా తేలికగా, వేగంగా  వేయాలి అనుకుంటున్నాను’ అని రాశారు. ఈ క్యూట్ ఫ్యామిలీ మోమెంట్‌ను చూసి హృతిక్ తల్లి పింకీ రోషన్ తీవ్రంగా భావోద్వేగానికి  లోనయ్యారు. ఆమె తన కుమారుడు మరియు మనవాళ్ళు కలిసి డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ నేను ఎంతో ఆనందంగా ఈ క్షణాన్ని పంచుకుంటున్నాను. ఈ ప్రత్యేక క్షణాన్ని చూసి ఎంతో ఆనందిస్తున్నాను, అది కూడా నా ఇష్టమైన సుఖీర్ పాట” అని పోస్ట్ చేశారు. హృతిక్ తన సినిమాల ద్వారా ఎంతో స్టార్ డమ్ తెచుకున్నాడు. అలాగే తన కుటుంబంతో గడిపే క్షణాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఆ డాన్స్ వీడియోను షేర్ చేసుకుంటున్నారు.

Exit mobile version