Site icon NTV Telugu

Hrithik Roshan : ఆ సమయంలో నన్నుచూసి ఎగతాళి చేసారు..

Whatsapp Image 2023 08 09 At 1.10.57 Pm

Whatsapp Image 2023 08 09 At 1.10.57 Pm

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు.తాజాగా హృతిక్ రోషన్ తాను నటించిన కోయీ మిల్ గయా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమా విడుదల అయి ఆగస్టు ఎనిమిదవ తేదీకి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో హృతిక్ రోషన్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తి కర విషయాలను తెలియజేశారు.ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రీతి జింటా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తన నిజ జీవితానికి కాస్త దగ్గరగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో తాను ఒక అమాయకపు పిల్లాడి పాత్రలో నటించాను అయితే నిజజీవితంలో కూడా తనకు ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయని తెలిపారు.

ఈ సినిమాలో నేను నత్తి ఉన్న పాత్రలో నటించాను. అయితే చిన్నప్పుడు నాకు కూడా కొద్దిగా నత్తి ఉండేది.నేను మాట్లాడుతుంటే చాలామంది నన్ను చూసి ఎగతాళి చేసేవారు. ఇలా నత్తిగా మాట్లాడటం వల్ల నన్ను చూసి నవ్వుకునే వారని ఈ సందర్భంగా హృతిక్ రోషన్ తెలిపారు. ఈ సినిమాలో స్కూల్లో నా స్కూటీని ధ్వంసం చేసినట్టు ఒక సీన్ ఉంటుంది..కానీ నిజ జీవితంలో నేను సైకిల్ పై స్కూల్ కి వెళ్లే వాడినని ఆయన తెలిపారు.కొంత మంది సీనియర్స్ నా సైకిల్ ను పాడు చేశారని ఆ సమయంలో నాకు ఎంతగానో కోపం వచ్చిందని హృతిక్ రోషన్ తన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.ఈ సినిమాలో రోహిత్ పాత్ర నా నిజ జీవితానికి కాస్త దగ్గరగా ఉండడంతో ఈ సినిమాలో ఎంతో నేచురల్ గా నటించగలిగానని హృతిక్ రోషన్ తెలిపారు. ఈ సినిమా తో మొదటిసారి రేఖా మేడం తో కలిసి నటించాను.. ఈ సినిమాలో ఆమె నన్ను ఒక చెంప దెబ్బ కొట్టే సీన్ ఉంటుంది..నిజంగా కొడితే ఎమోషన్స్ ఎంతో అద్భుతంగా వస్తాయని చెప్పి ఆమె నన్ను కొట్టారు. అయితే ఆ చెంప దెబ్బ చాలా గట్టిగా తగిలిందని ఆయన చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version