NTV Telugu Site icon

Chilli Potato Bites: స్నాక్స్ కోసం వెతుకులాటనా? ఇంట్లోనే బంగాళాదుంపలతో చిల్లీ పొటాటో బాల్స్‌ను చేసేయండి ఇలా

Chilli Potato Balls

Chilli Potato Balls

Chilli Potato Bites: ప్రపంచంలో జరుగుతున్న విషయాలను ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా క్షణాల వ్యవధిలో విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. అలాగే మనలో చాలామంది ఆహార ప్రజలు ఉండనే ఉంటారు. అలాంటివారు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ వంటకాలను తినడానికి ఇష్టపడుతుంటారు. మరికొందరైతే ఏకంగా విదేశీ వంటకాలను కూడా తినడానికి తెగ ఇష్టపడుతుంటారు. ఇప్పుడు కొరియన్ ఫుడ్ ట్రెండ్ భారతదేశంలో చాలా వేగంగా పెరిగింది. కొరియన్ వంటకాలు, ముఖ్యంగా కొరియన్ స్పైసీ నూడుల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొరియన్ ఫుడ్ ఇష్టపడే వారు ఎప్పుడూ కొత్త రుచులను అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారికోసం, ఈ రోజు మనం కొరియన్ చిల్లీ పొటాటో బాల్స్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. ఇవి స్నాక్స్‌గా, ప్రత్యేకంగా సాయంత్రం లేదా పార్టీకి ఒక అదనపు వంటకంగా ఉపయోగపడతాయి. మరి ఈ కొరియన్ చిల్లీ పొటాటో బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేదామా..

Read Also: Collector Dance Viral: రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్స్‌లో కలెక్టర్ డ్యాన్స్‌ వైరల్‌.. భార్యతో కలిసి మాస్‌ స్టెప్పులు

కొరియన్ చిల్లీ పొటాటో బాల్స్ కోసం కావాల్సిన పదార్థాలు:

* 4 ఉడికించిన, మెత్తగా చేసిన బంగాళాదుంపలు
* 4 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్
* 1 టేబుల్ స్పూన్ నూనె
* 4 నుండి 5 వెల్లుల్లి తరిగిన కత్తిరాలు
* 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్
* 1 టేబుల్ స్పూన్ తరిగిన కొత్తిమీర
* అర టేబుల్ స్పూన్ కాశ్మీరీ ఎర్ర కారం
* ½ టీస్పూన్ తెల్ల నువ్వులు
* 1 నుండి 1.5 లీటరు నీరు

Read Also: Pregnancy Time: గర్భధారణ సమయంలో ఈ పండ్లు తింటున్నారా? తల్లి, బిడ్డలిద్దరికి డేంజరే!

కొరియన్ చిల్లీ పొటాటో బాల్స్ తయారీ విధానం:

* ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి, వాటిని ఉడికించాలి.
*ఉడికిన బంగాళదుంపలను మెత్తగా స్మాష్ చేయాలి.
* ఇప్పుడు ఈ మెత్తని బంగాళదుంప పిండిలో 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.
*ఈ పిండిని చిన్న భాగాలుగా తీసుకుని బంతులను తయారుచేయాలి.
*ఇప్పుడు పాన్‌లో 1 లీటరు నీరు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, అందులో బంగాళదుంప బాల్స్ వేసి 10 నిమిషాలు ఉడికించాలి.
* తర్వాత, ఈ ఉడికిన బంగాళదుంప బాల్స్‌లో కొత్తిమీర, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, సోయా సాస్, కాశ్మీరీ ఎర్ర కారం, తెల్ల నువ్వులు, వేడి నూనె జోడించండి.
* ఆ తర్వాత అన్నింటినీ బాగా కలిపితే మీ కొరియన్ చిల్లీ పొటాటో బాల్స్ రెడీ.
ఈ రుచికరమైన కొరియన్ చిల్లీ పొటాటో బాల్స్ స్నాక్‌గా లేదా మీకు కావలసినప్పుడు పండుగ సందర్భాల్లో కూడా అద్భుతంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల కోసం ఈ వంటకం చేస్కోవచ్చు.