NTV Telugu Site icon

Fake Protein Powder: నకిలీ ప్రోటీన్ పౌడర్లను గుర్తించేదెలా..?

Fake Protein Powder10

Fake Protein Powder10

ఈ మధ్య యువకులు బాడీ పెంచడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం మార్కెట్లలో దొరికే ప్రోటీన్ పౌడర్లపై ఆధార పడుతున్నారు. కొన్ని ప్రోటీన్ పౌడర్లు శరీరానికి మంచివి కాదని నిపుణులు చెబుతున్నారు. మధ్య కాలంలో ప్రొటీన్ పౌడర్ వాడకం మారి ఎక్కువైపోయింది. జిమ్ వెళ్లేవారు, వెళ్లనివారు కూడా దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రొటీన్ పౌడర్ల వాడకం గురించిన సమాచారం, తప్పుడు సమాచారం, వాస్తవాలు, అపోహలు ప్రచారంలో ఎప్పుడూ ఉంటాయి.

READ MORE: Imran Khan: పాకిస్తాన్ ఆర్మీ నన్ను చంపడమే మిగిలింది.. మాజీ ప్రధాని సంచలనం..

కొందరు యువకులు సులభంగా బరువు తగ్గించే పద్ధతుల కోసం వెతుకుతుంటారు. వారు డాక్టర్ల ప్రమేయం లేకుండా ప్రొటీన్ పౌడర్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అన్ని ప్రొటీన్ పౌడర్ సప్లిమెంట్స్ మంచివేనా? నకిలీ ప్రొటీన్ పౌడర్‌ను ఎలా గుర్తించాలి? అనే ది మనం ఇప్పుడు చూద్దాం.. ప్రొటీన్ పౌడర్ విక్రయించినప్పుడు గుడ్డిగా వ్యవహరించరాదు. ప్యాకేజీపై స్పెల్లింగ్ మిస్టెక్స్, ప్యాకేజింగ్ డిజైన్, లేబుల్ సమాచారం కచ్చితంగా పరిశీలించాలి. బ్రాండెడ్ కంపెనీల పేరుతో కొందరు నకిఖీవి తయారు చేసి అమ్ముతుంటారు. మంచి ఉత్పత్తులు సాధారణంగా ప్రొఫెషనల్ ప్యాకేజింగ్, కచ్చితమైన లేబులింగ్ కలిగి ఉంటాయి. తయారీదారు పేరు, చిరునామా, సంప్రదింపు సమాచారం కోసం లేబుల్‌ని తనిఖీ చేయండి.

మీరు కొనుగోలు చేసిన పౌడర్ కంపెనీ ప్యాకేజింగ్‌పై ఈ సర్టిఫికేషన్ బాడీల సీల్స్ లేదా లోగోలు చూడండి. కంపెనీకి సంబంధించి వెబ్ సైట్లో చెక్ చేసుకోండి. నకిఖీ ప్రోటీన్ పౌడర్లు ఒరిజినల్ పౌడర్తో పోలిస్తే రంగులో తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది. పౌడర్‌లో ఏదైనా గడ్డలు, రంగు మారడంలాంటివి ఉంటే చూడండి. అసలైన పౌడర్ల వాసన వేరేగా ఉంటుంది. పొడి వాసనపై శ్రద్ధ వహించండి. కొన్ని ప్రొటీన్ సప్లిమెంట్లు ప్రత్యేకమైన వాసన కలిగి ఉండగా.. మరికొన్ని అధ్వానంగా ఉంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, అనధికారిక వెబ్‌సైట్‌ల నుండి ప్రొటీన్ పౌడర్‌ను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఫిట్‌నెస్ లక్ష్యాలు, ఆహార అవసరాలు, మీకు ఏవైనా నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని పరిగణించండి.

ప్రొటీన్ పౌడర్‌లు అనేక రకాలుగా ఉంటాయి. ప్రతి రకానికి దాని స్వంత ప్రత్యేక లక్షణాలు, జీర్ణశక్తి, అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉన్నాయి. వెయ్ ప్రొటీన్ దాని వేగవంతమైన శోషణ, అధిక అమైనో యాసిడ్ కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది పోస్ట్-వర్కౌట్ రికవరీకి అనువైనది. కాసిన్ ప్రొటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇలా ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంలో భాగంగా మార్కెట్లో దొరికే నాసిరకమైన ప్రోటీన్ పౌడర్లు కొని వాడొద్దు. శరీరంపై ఒక్కసారి ఎఫెక్ట్ పడితే అది జీవితాంతం ఉంటుంది. అందుకే పౌడర్లు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.