NTV Telugu Site icon

Boi Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు ఎలా అప్లై చేసుకోవాలంటే?

Bank

Bank

బ్యాంక్ లో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ డ్రైవ్ లో స్కేల్ 4 వరకు వివిధ విభాగాల్లో ఆఫీసర్లను భర్తీ చేయనున్నారు. మార్చి 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 ఏప్రిల్ 10న ముగియనుంది.. ఆసక్తి, అర్హతలు కలిగిన వారు బ్యాంక్ అధికార వెబ్ సైట్ bankofindia.co.in నోటిఫికేషన్ ను చూసి అప్లై చేసుకోవాలి..

అర్హతలు..

గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..

అర్హులైన అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్లైన్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.. రాత పరీక్షలలో అర్హతలను సాధించాలి.. పరీక్షల ఆధారంగా మెరిట్ వారిని సెలెక్ట్ చేసి పోస్టులను భర్తీ చేస్తారు..

అప్లికేషన్ ఫీజు..

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు జనరల్, ఇతరులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. మాస్టర్/ వీసా/ రూపే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐ వంటి వాటి ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలని అనుకొనేవారు అధికార వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

Show comments