Site icon NTV Telugu

Japan: కత్తెర కారణంగా 36 విమానాలు రద్దు, 200 విమానాలు ఆలస్యం

New Project (68)

New Project (68)

Japan: వివిధ కారణాలతో విమానాలు రద్దు అవుతుంటాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుంటాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు ప్రజలు ఈ విమానాలను ఆశ్రయిస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో విమాన రద్దు, ఆలస్యం కారణంగా వారి పనికి ఆటంకం ఏర్పడుతుంది. వాతావరణం సహకరించకపోవడం, విమానాలలో సాంకేతిక లోపం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి అనుమతి లభించకపోవడం వంటి కారణాల వల్ల సాధారణంగా విమానాలు రద్దు చేయబడతాయి లేదా ఆలస్యం అవుతాయి. అయితే ఇక్కడ మాత్రం కత్తెర కారణంగా పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. మరిన్ని విమానాలు తీవ్ర ఆలస్యానికి దారి తీసింది. తీవ్ర చర్చకు దారితీసింది.

జపాన్‌లో అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హక్కైడో ద్వీపంలోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్‌లోని రిటైల్ స్టోర్ నుండి ఒక కత్తెర ఆగష్టు 17న కనిపించకుండా పోయింది. ఆ రిటైల్ స్టోర్ యజమాని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. కత్తెర కోసం విమానాశ్రయం మొత్తం వెతికారు. విమానాలు ఎక్కేందుకు ఎయిర్‌పోర్టుకు వస్తున్న ప్రయాణికుల భద్రతా తనిఖీలను నిలిపివేసి.. దాదాపు 2 గంటలపాటు కత్తెర కోసం వెతికారు. దీంతో అధికారులు ఆ విమానాశ్రయం నుంచి 36 విమానాలను రద్దు చేశారు. అదే సమయంలో, మరో 201 విమానాలు ఆలస్యంగా నడిచాయి.

Read Also:Jasprit Bumrah: బుమ్రా కంటే అత్యుత్తమ పేసర్ ఎవరూ లేరు.. న్యూజిలాండ్ కెప్టెన్ ప్రశంసలు!

ఈ క్రమంలో ఈ ఘటనపై న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించారు. విమానాశ్రయంలోని రిటైల్ స్టోర్‌లో కత్తెర కనిపించకపోవడంతో ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు చేశామన్నారు. ఎవరైనా ఉగ్రవాదులు కత్తెరను తీసుకుని బెదిరించి విమానాలను హైజాక్ చేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. అదృశ్యమైన కత్తెర ఎట్టకేలకు అదే చిల్లర దుకాణంలో లభ్యమైంది. ఈ నేపథ్యంలో ఆ రిటైల్ స్టోర్‌లో నిర్వహణ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని ఎయిర్‌పోర్టు అధికారులు ఎట్టకేలకు తేల్చారు.

అయితే ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విమానాలు ఆలస్యం కావడంతో అదే న్యూ చిటోస్ విమానాశ్రయంలో చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు నిరీక్షణ భరించలేక వెళ్లిపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ విమానాశ్రయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Read Also:Chiranjeevi: నీ అభిమానం సల్లగుండా.. పొర్లు దండాలు పెడుతూ తిరుమల మెట్లెక్కిన అభిమాని

Exit mobile version