NTV Telugu Site icon

Israel: ఇజ్రాయిల్ మొస్సాద్ అనుకుంటే “టూత్ పేస్ట్”తో కూడా చంపేస్తుంది.. వాడి హద్దాద్ ఒక ఉదాహరణ..

Wadie Haddad

Wadie Haddad

Israel: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థల్లో ఇజ్రాయిల్ దేశ ‘మొస్సాద్’ ప్రముఖమైంది. ఎన్నో విజవంతమైన ఆపరేషన్లను నిర్వహించిన మొస్సాద్, ఇజ్రాయిల్ శత్రువుల్ని హతమార్చింది. తాజాగా హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని కూడా మొస్సాద్ చంపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 1978లో పాలస్తీనాకి చెందిన ‘పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా’ చీఫ్ వాడి హద్దాద్‌ని ‘‘టూత్ పేస్ట్’’ ఉపయోగించి చంపిన మొస్సాద్ ఆపరేషన్ ఇప్పటికీ సంచలనమే.

1978లో బాగ్దాద్‌లో రోజూవారీగా భోజనం చేసిన వాది హద్దాద్ ఆ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇరాక్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయితే, అతడికి హెపటైటిస్ ఉందని డాక్టర్లు చెప్పారు. అతడి ఆరోగ్యం మెరుగుపడేందుకు పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్‌ని ఇచ్చారు. అప్పటికీ అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఆ తర్వాత జట్టు రాలడం ప్రారంభమైంది, తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. అసలు అతడి ఆరోగ్య పరిస్థితి రోజురోజు దిగజారుతుండటానికి ఏది కారణమైందనే విషయం డాక్టర్లకు కూడా అంతుబట్టలేదు.

ఈ విషయంలో అప్పటి తూర్పు జర్మనీని పాలెస్తీనా పాలకుడు యాసిర్ అరాఫత్ సాయమడిగాడు. హద్దాద్‌ని బాగ్దాద్ నుంచి విమానం ద్వారా తూర్పు బెర్లిన్‌కి తరలించారు. అప్పటికే మార్చి 19, 1978 ముందు హద్దాద్ బాగ్దాద్ ఆస్పత్రిలో అత్యంత బాధకరమైన పరిస్థితుల్లో 2 నెలలు గడిపాడు. ఈ సమయంలోనే తూర్పు జర్మనీ జోక్యం చేసుకుంటే అతడి ఆరోగ్యం మెరుగుపడుతుందని అరాఫత్ అనుకున్నాడు. ఇతడిని తూర్పు బెర్లిన్ తీసుకువెళ్లే సమయంలో అతడికి సంబంధించిన మలమూత్రాలతో పాటు టూత్ పేస్ట్‌ని తీసుకెళ్లారు.

41 ఏళ్ల హద్దాద్ తూర్పు బెర్లిన్‌ ఆస్పత్రిలో బాధ భరించలేక అరవడం చుట్టుపక్కలకు వినిపించేది. చాలా సార్లు రక్తస్రావం జరిగేది. అతడి గుండె చుట్టూ పెరికార్డియం రక్తం కారుతుండేది. నాలుక, గొంతు నుంచి కూడా రక్తం కారేది. అతడికి వైద్యం చేస్తున్నప్పటికీ అతడి ప్లేట్ లెట్ కౌంట్ దారుణంగా పడిపోయింది. చివరి 10 రోజులు హద్దాద్ అత్యంత దారుణమైన బాధను అనుభవించాడు. మార్చి 29న హద్దాద్ మరణించాడు. అయితే పరిశోధకులు ర్యాట్ – పాయిజన్ లేదా థాలియం విషప్రయోగం జరిగిందని భావించారు. ఫోరెన్సిక్ నిపుణుడు ప్రొఫెసర్ ఒట్టో నుండి హద్దాద్ మరణ వివరాలను తూర్పు జర్మనీ స్పై ఏజెన్సీ స్టాసీ అందుకుంది.

Read Also: Karnataka Health Minister: జైపూర్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన మాంసం కుక్కలది కాదు.. గొర్రెలదే

వాడి హద్దాద్‌ని ఇజ్రాయిల్ ఎందుకు టార్గెట్ చేసింది.?

వాడీ హద్దాద్ జూన్ 27, 1976లో ఇజ్రాయిల్ టెల్ అవీవ్ నుంచి గ్రీస్ ఎథెన్స్ మీదుగా పారిస్ వెళ్తున్న ఫ్రాన్స్ ఫ్లైట్‌ 139 హైజాకింగ్‌‌లో కీలకంగా వ్యవహరించారు. ఎథెన్స్‌లో విమానం ఆగిన సమయంలో మొత్తం 58 మంది విమానం ఎక్కారు. ఇందులో నలుగురు హైజాకర్లు ఉన్నారు. వీరు విమానాన్ని దారి మళ్లించి ఉగాండాలోని ఎంటెబ్బే ఎయిర్‌పోర్టుకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’’ చేసి విమానాన్ని హైజాకర్ల బారి నుంచి రక్షించింది. లెఫ్టినెంట్ కల్నల్ యోనాతన్ నెతన్యాహూ ఈ దాడికి నేతృత్వం వహించారు. ఈ పోరులో ఆయన మరణించారు.

హద్దాద్‌ని టార్గెట్ చేసిన మొస్సాద్:

జూలై 1976 హైజాకింగ్ తర్వాత హద్దాద్ ఇజ్రాయిల్ ‘‘కిల్ లిస్టు’’లో చేరారు. ఈ హైజాక్ జరిగిన 1.5 ఏళ్ల తర్వాత హద్దాద్ ఇరాక్‌లోని బాగ్దాద్, లెబనాన్‌లోని బీరూట్‌లలో సేద తీరుతున్నాడు. హద్దాద్‌ను చంపే పని ‘ఏజెంట్ సాడ్‌నెస్’కి అప్పగించబడింది. ఏజెంట్ సాడ్‌నెస్‌కి హద్దాద్ ఇల్లు మరియు ఆఫీసు రెండింటికీలోకి వెళ్లేందుకు చాలా అనుమతి ఉంది. ఇజ్రాయిల్ టెల్ అవీవ్‌కి ఆగ్నేయంగా ఉన్న నెస్ జియోనాలోని స్ జియోనాలోని ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్‌లో టూత్‌పేస్ట్ ట్యూబ్‌లో విషాన్ని అభివృద్ధి చేశారు. దీనిని హద్దాద్‌ ఉపయోగించేలా ప్లాన్ చేశారు.

ఈ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకున్న ప్రతీసారి ఇందులోని విషాలు నాలుక ద్వారా అతని శరీరంలోకి చేరాయి. ఒకానొక దశలో దాని ప్రభావం తీవ్రం కావడంతో హద్దాద్ ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఆ తర్వాత తూర్పు జర్మనీ స్పై ఏజెన్సీ తన నివేదికల్ని ఇరాక్ ఇంటెలిజెన్స్‌కి పంపింది. ఇరాకీ శాస్త్రవేత్తలు, ప్రముఖులు ఇరాక్ నుంచి వెళ్లే సమయంలో వారి టూత్ పేస్ట్‌లు, బ్రష్‌లను తమతో తీసుకెళ్లాలని సూచించారు. అయినప్పటికీ కూడా మరో ఇద్దరు ఇలాగే విష ప్రయోగం ద్వారా మరణించారు.

Show comments