Site icon NTV Telugu

Firefly Glow: మినుగురు పురుగులు వాటంతట అవి ఎలా వెలుగుతాయి? అసలేంటి ఆ రహస్యం!

Firefly Glow

Firefly Glow

Firefly Glow: మినుగురు పురుగులు… వీటిని మనందరం చూసే ఉంటాం. మనం రాత్రివేళలో గమనిస్తే, చిన్న చిన్న లైట్స్ లా వెలుగుతూ ఉంటాయి. అసలు వాటంతట అవి అంత అందంగా ఎలా వెలుగుతాయి? అసలు ఎందుకు వెలుగుతాయనేది ఇప్పుడు చూద్దాం.. మనం చూసే ఈ మినుగురు పురుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్నిటి నుండి పసుపు, ఆకుపచ్చ, ఆరెంజ్ ఇలా రకరకాల కలర్స్ లైట్ అనేది వెలువడుతుంది. అయితే, ఇలా బ్రతికి ఉన్న జీవులలో కెమికల్ రియాక్షన్ జరగడం ద్వారా లైట్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ‘బయో లూమినసెన్స్’ అని అంటారు.

ఎవరు ఈ మిస్టరీ బాయ్ ఫ్రెండ్! అతడితో Sara Tendulkar చెట్టాపట్టాల్?

అయితే ఇలాంటివి సముద్రాలలో ఉండే కొన్ని రకాల చేపలు జెల్లీ ఫిష్ లు కూడా ఇలా కాంతిని వెదజల్లుతాయి. అయితే, ఈ మినుగురు పురుగులలో కాంతి వెదజల్లడానికి కారణం వీటి కడుపులో లాంటర్న్ అనే అవయవం ఉంటుంది. దీనిలో లూసిఫెరైన్ అనే కాంపౌండ్ తో పాటు లూసిఫెరేజ్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మినుగురు పురుగు శ్వాస తీసుకుంటుందో అప్పుడు కొంత ఆక్సిజన్ కడుపులోని లాంటర్న్ అనే అవయవంలోకి చేరుకొని లూసిఫెరైన్, లూసిఫెరేజ్ తో కలిసినప్పుడు అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి కాంతి అనేది విడుదలవుతుంది.

Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?

అయితే, ఇది మన ఇంటిలో వెలిగే లైట్ బల్బుల నుండి వచ్చే లైట్ లాంటిది కాదు. లైట్ బల్బ్ లో చూసుకుంటే 90% ఎనర్జీ అనేది హీట్ రూపంలో మిగిలిన 10% లైట్ రూపంలో విడుదల అవుతుంది. కానీ, మినుగులు పురుగుల్లో 100% లైట్ రూపంలోనే విడుదల అవుతుంది. అందుకే దీనిని ‘కోల్డ్ లైట్’ అని కూడా అంటారు అయితే, కేవలం ఈ మినుగురు పురుగులు మాత్రమే కాదు. వాటి గుడ్లు లార్వాల నుండి కూడా ఈ కాంతి వెలువడుతుంది.

Exit mobile version