NTV Telugu Site icon

Houthi Rebels: చైనా ఆయిల్‌ నౌకపై హౌతీ రెబల్స్ దాడి..

Houthis

Houthis

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులను కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం (మార్చ్‌ 23) యెమెన్‌ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక ఎంవీ హంగ్‌ పూ పై బాలిస్టిక్‌ మిసైళ్లతో హౌతీలు దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్‌ కమాండ్‌ ఆదివారం (మార్చ్‌ 24) నాడు ఎక్స్‌(ట్విటర్‌)లో వెల్లడించింది. పనామా ఫ్లాగ్‌తో నడుస్తున్న ఈ నౌకను చైనా యాజమాన్యం నిర్వహిస్తుంది.

Read Also: Avanigadda Crime: అవనిగడ్డలో యువకునిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం..!

అయితే, ఈ ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక భారత్‌లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. నౌకలో మంటలు చెలరేగినప్పటికీ వాటిని కేవలం 30 నిమిషాల్లో ఆర్పి వేశారు అని పేర్కొన్నారు. ఆ తర్వాత నౌక మళ్లీ ప్రయాణం కొనసాగించింది. ఇక, చైనా- భారత్‌ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీ రెబల్స్ తాజా దాడితో మాట తప్పారు అని డ్రాగన్ కంట్రీ మండిపడింది. ఇక, ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంత కాలంగా దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్‌ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు పెరిగిపోతుంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తునే ఉంది.

Show comments