Site icon NTV Telugu

House Rent 3Lakhs : అక్కడ ఇంటి అద్దె అక్షరాల రూ.3లక్షలు

London

London

House Rent 3Lakhs : లండన్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. చాలా మంది యజమానులు సగటున రూ. 2.5 లక్షలు చెల్లిస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది ఇంటి యజమానులు అద్దెలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. కొన్ని చోట్ల అద్దె మూడు లక్షల వరకు పలుకుతోంది. కరెంటు రేట్ల పెంపుతో పాటు అద్దె పెంపుదల వల్ల ఉద్యోగాలు, ఇతరత్రా పనుల నిమిత్తం లండన్‌కు వచ్చిన భారతీయులతో పాటు విదేశీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.

Read Also: Roman City : ఈజిప్టులో అతి పురాతన రోమన్ నగరాన్ని కనుగొన్న ఆర్కియాలజిస్టులు

టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. గతేడాది చివరి త్రైమాసికంలో అద్దె రూ.2.5 లక్షలకు చేరగా, ఈ ఏడాది రూ.3 లక్షలకు పెరిగింది. గత ఏడాది లండన్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఇంటి అద్దె పెరుగుదల నమోదైంది. లండన్ వెలుపల, రేట్లు సగటున 9.7శాతానికి పెరిగాయి. 2021 తర్వాత, అద్దె రేటు విపరీతంగా పెరగబోతోంది.

Read Also: Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‎కు గురైన ఓనర్

మెట్రో వార్తా కథనం ప్రకారం.. చాలా మంది ఇంటి యజమానులు.. ఇంటి అద్దెను అదనంగా డబ్బు సంపాదించే మార్గంగా ఉపయోగించుకుంటున్నారు. తూర్పు లండన్‌లోని డాల్‌స్టన్‌లోని ఓ బ్యాంకు ఉద్యోగి తన ఇంటిలో ఉపయోగించని రెండు పార్కింగ్ ప్రాంతాలను ఆరేళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. అందుకు అక్షరాల అద్దె రూ.7 లక్షలు. నెలకు రూ.10,000 అద్దె ఇస్తానని ఆన్‌లైన్‌లో ప్రచారం చేశాడు.

Exit mobile version