NTV Telugu Site icon

Biryani: బిర్యానీ సరిగ్గా ఉడకలేదని ప్రశ్నించినందుకు హోటల్ సిబ్బంది దాడి

Biryani

Biryani

Hyderabad: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ ఓ హోటల్ లోని బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా ధూల్ పేట్ కు చెందిన కొందరు వ్యక్తులు రాత్రి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు.. అయితే, ఆ బిర్యానీలోని మటన్ సరిగ్గా ఉడకలేదని వారి ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు గొడవకు దిగారు.

Read Also: Bhumika Chawla: వ్యాపారంలోకి అడుగు పెట్టిన భూమిక.. ఏంటో తెలుసా?

దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రమైంది. మొదటగా హోటల్ వెయిటర్లపై దాడికి దిగడంతో.. వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. కొంత మంది వినియోగదారులకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను మధ్య మండలం టాస్కో ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి.. అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమానిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.