NTV Telugu Site icon

Horse Viral Video: మొదటిసారి అద్దంలో చూసుకున్న గుర్రం.. ఏం చేసిందంటే?

Horse

Horse

Horse Viral Video: మనం సింహం తన నీడను నీటిలో చూసి ఏదో విచిత్ర జంతువు వచ్చిన్నట్లు భయపడిపోయే కథను చిన్నప్పుడు వినే ఉంటాం. మనుషులే కాదు జంతువులు కూడా అద్దంలో చూసుకుంటూ ఉంటాయి. అయితే మొదటి సారి వాటిని అవి చూసుకున్నప్పుడు భయంతో ఎలా పడితే అలా చేస్తూ ఉంటాయి. జంతువులు అద్దంలో చూసుకునే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. అవి అలా అద్దంలో చూసుకుంటూ ఉంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. అంతేకాకుండా నవ్వు కూడా వస్తుంది. అటవీ ప్రాంతంలో ఉండే కొన్ని కోతులు, చిపాంజీలు అడవిలో ఏర్పాటు చేసిన కొన్ని అద్దాలలో చూసుకుంటూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోలు చాలానే సోషల్ మీడియో లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటిదే ఓ గుర్రానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

Also Read:  Viral Video: పంక్చర్ వేసేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే ప్రమాదమే

ఈ వీడియోలో ఓ గుర్రం  షెడ్డులోకి వచ్చి ఒక అద్దాన్ని చూస్తుంది. మొదటి సారి తన ముఖాన్ని అద్దం చూసుకున్నప్పుుడు ఇది ఏదో విచిత్రంగా ఉండే అన్నట్టు ఆ గుర్రం అద్దం లోపలికి తల పెట్టి చూస్తుంది. తరువాత ఎందుకో దానికి భయం అనిపించినట్లు అద్దంలోకి చూడకుండా తలను అటూ ఇటూ తిప్పుతుంది. తరువాత మళ్లీ అద్దంలోకి చూస్తూ ఇది నేనేనా అన్నట్లు చూసుకుంటుంది. కొద్ది సేపు అలా అద్దలో చూసుకొని మురిసిపోతుంది. కొద్ది సేపు అలా చూసుకున్న తరువాత దానికి భయం అనిపించి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోలో అది వెళ్లిపోవడం చూస్తుంటే అది భయపడినట్లు ఖచ్చితంగా అర్థం అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన వారందరూ అద్దంలో చూసుకుంటూ ఈ గుర్రం అమ్మాయిలా సిగ్గు పడుతుంది.. బహుశా ఇది ఆడ గుర్రం అనుకుంటా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ గుర్రం చాలా కామెడీగా ఉందంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్ర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని ఇప్పటి వరుకు 5 మిలియన్లకు పైగా వీక్షించారు. లక్షల మంది లైక్ చేయగా వేల మంది కామెంట్స్ చేస్తున్నారు.

 

Show comments