Hop On Kangaroo: టూరిజం పేరుతో కపుల్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ విదేశాలకు తీసుకెళ్లే ఆఫర్స్ చూస్తుంటాం.. కానీ, స్పోర్ట్స్ టూరిజం ఎప్పుడైనా విన్నారా..? మీకు క్రీడలపై ఆసక్తి ఉంటే చాలు.. విదేశాలకు తీసుకెళ్లి స్టార్ ప్లేయర్స్‌తో గేమ్స్ ఆడే అవకాశం కల్పిస్తోంది ఓ సంస్థ. ప్రతిష్టాత్మక సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు ఓ వినూత్న ప్రయోగానికి “హాప్ ఆన్ కంగారు “సంస్థ శ్రీకారం చుట్టింది. ఇక, ఇందు కోసం ఏం చేయాలి..? విదేశాలకు వెళ్లేందుకు సెలెక్ట్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి..? అనే విశేషాలు చూస్తే..!
TG Bharath: శ్రీసిటీ తరహాలో ఇండస్ట్రియల్ జోన్లను తయారుచేయాలి.. మంత్రి టి.జి భరత్..
ప్రస్తుత జీవనశైలిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. పిల్లలపై ర్యాంకుల ఒత్తిడి తెస్తున్నారు పేరెంట్స్.. విద్యార్థులు కూడా స్కూల్, కాలేజ్ అంటే కేవలం చదువు మాత్రమే అనుకుంటున్నారు. కార్పొరేట్ పోటీ ప్రపంచంలో విద్యాసంస్థలు కూడా ప్లే గ్రౌండ్, స్పోర్ట్స్ కు ఎప్పుడో స్వస్తి పలికాయి. మొత్తంగా విద్యార్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ కోల్పోయి శారీరకంగా, మానసికంగా ధృడంగా లేకపోవడమే కాకుండా.. ఆత్మహత్యలకూ ప్రేరేపితమవుతున్నారు. విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి కలిగించడమే కాకుండా.. విదేశాలకు తీసుకెళ్లి మరీ.. పలు రకాల క్రీడలపై శిక్షణ ఇచ్చి.. స్టార్ట్ ప్లేయర్స్‌తో గేమ్స్ ఆడే వినూత్న అవకాశం కల్పిస్తోంది “హాప్ ఆన్ కంగారు” అనే ఆస్ట్రేలియాకు చెందిన సంస్థ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియల్ మాడ్రిడ్ స్పోర్ట్స్ క్లబ్, కార్లోస్ ఆల్కరాజ్ క్లబ్, క్రికెట్ విక్టోరియా, మెల్ బోర్న్ యూనివర్సిటీల సహకారంతో భారత్‌కు చెందిన విద్యార్థులకు ఆస్ట్రేలియాలో ఈ సంస్థ శిక్షణ ఇవ్వనుంది.
Drugs Mafia: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం..
మానసికంగా, శారీరకంగా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు యూనిక్ కాన్సెప్ట్ ప్రారంభించినట్లు హాప్ ఆన్ కంగారు ఫౌండర్ హరీష్ బీసం చెప్తున్నారు. విద్యార్థుల్లో పాజిటివ్ ఆలోచన రావడమే కాకుండా, స్పోర్ట్స్ టూరిజం, మెల్బోర్న్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో ట్రైనింగ్ క్లాస్, క్రికెట్ విక్టోరియాతో ట్రైనింగ్ క్లాస్, భారత్, ఆస్ట్రేలియా విద్యార్థుల మధ్య ఓ గెట్ టు గెదర్ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు రియల్ మాడ్రిడ్ క్లబ్, కార్లోస్ ఆల్కరాజ్, క్రికెట్ విక్టోరియా, మెల్బోర్న్ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్స్ అందజేస్తామన్నారు. విద్యార్థులకు మంచి గుర్తింపుతో పాటు జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ప్రతిష్టాత్మక సంస్థలను చేరువచేస్తున్నామంటున్నారు. 15 రోజుల పాటు విద్యార్థులకు లీడర్ షిప్ స్కిల్స్, రెసిలియన్స్, ఫోకస్ వంటి క్వాలిటీస్ నేర్చుకొనే డిజిటల్ డిటాక్స్ ప్రొగ్రాంల అవుతుందంటున్నారు నిర్వాహకులు. 15 రోజుల పాటు నిర్వహించే ఈ టూర్ లో విద్యార్థులకు ఫ్లైట్ ఛార్జీలు, వసతి, భోజనం అన్నీ హాప్ ఆన్ కంగారు సంస్థ భరిస్తుందని సంస్థ ఫౌండర్ హరీష్ బీసం వెల్లడించారు.