ప్రముఖ మొబైల్ కంపెనీ హానర్ ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. హానర్ కంపెనీ ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనుంది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
హానర్ 9x 5జీ పేరుతో ఫోన్ లాంచ్ కానుంది.. ఈ స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15 న మార్కెట్‌లోకి రానుంది. X9b 5G లాంచ్ గురించి హానర్ ఓ మీడియా ప్రకటన విడుదల చేసింది.ఈ Honor X9b 5G స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12GB వరకు ర్యామ్‌ను ప్యాక్ చేసి, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800 బ్యాటరీతో మంచి బ్యాకప్‌ని ఇవ్వనుంది.హానర్ అల్ట్రా-బౌన్స్ యాంటీ-డ్రాప్ డిస్‌ప్లే 3 లెవల్ ప్రొటెక్షన్ స్క్రీన్‌తో వస్తుంది.. ఈ ఫోన్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది.. సెల్ఫీ ప్రియులకు పండగే పండగ.. ఈ ఫోన్లో 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.ఇంతే కాకుండా Honor X9b 5G స్మార్ట్‌ఫోన్‌లో Wi-Fi 5, బ్లూటూత్ 5.1 తో పాటుగా ఇంకా ఎన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.. ధర విషయానికొస్తే.. స్మార్ట్‌ఫోన్ అంచనా ధర రూ. 25,000 మరియు రూ. 30,000 మధ్య ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.. మరి ఎంత ఉంటుందో చూడాలి..
