Honor Pad X10 Mini: హానర్ (Honor) నుండి సరికొత్తగా ‘Honor Pad X10 Mini’ పేరుతో కాంపాక్ట్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ట్యాబ్లెట్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. మెటల్ బాడీ, భారీ బ్యాటరీ, ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించిన ఎడ్యుకేషనల్ ఫీచర్లతో వస్తున్న ఈ ట్యాబ్లెట్ ప్రారంభ ధర 1,099 యువాన్లు (సుమారు రూ. 13,800 లేదా $165)గా నిర్ణయించారు. ఇందులో 9.7-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2052×1152 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పాటు 100% sRGB కలర్ కవరేజీని అందిస్తుంది. భద్రత కోసం స్క్రీన్‌పై సెకండరీ స్ట్రెంగ్త్ గ్లాస్ రక్షణను అందించారు. ఆల్-మెటల్ యూనిబాడీ డిజైన్‌తో రూపొందించిన ఈ ట్యాబ్లెట్ 8.48 మిమీ మందం, 477 గ్రాముల బరువు ఉంటుంది. ఇది SGS ఫైవ్-స్టార్ గోల్డ్ డ్రాప్ మరియు ప్రెజర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలను కూడా కలిగి ఉంది.
ఈ ట్యాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 685 (Snapdragon 685) ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో లభిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకునే సదుపాయం ఉంది. రోజువారీ మల్టీటాస్కింగ్, చదువు, వినోద అవసరాలకు ఈ ప్రాసెసర్ తగిన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇంకా దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ కోసం ఇందులో 8,000mAh బ్యాటరీని అందించారు. ఇది 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 82 రోజుల స్టాండ్‌బై, 122 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లేదా 16 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. వీడియో కాల్స్ మరియు ఫొటోల కోసం ముందు, వెనుక వైపులా 5MP కెమెరాలను అందించారు. మెరుగైన ఆడియో అనుభవం కోసం డ్యూయల్ స్పీకర్లను అమర్చారు.
చిన్న పిల్లలు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని హానర్ ఈ ట్యాబ్లెట్‌లో ప్రీ-స్కూల్ కంటెంట్‌ను పొందుపరిచింది. ఇందులో ‘ఆక్టోనాట్స్’ (Octonauts) థీమ్ వనరులు, 2,000 కంటే ఎక్కువ పిల్లల పాటలు, 17,000కి పైగా యానిమేటెడ్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇది పిల్లల చదువుకు, కాలక్షేపానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. Honor Pad X10 Mini రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ 1,099 యువాన్లు కాగా, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను 1,399 యువాన్లుగ నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వై-ఫై మోడల్ ‘స్టారీ గ్రే’ (Starry Grey) రంగులో లభిస్తోంది. రిటైల్ బాక్స్‌లో ఛార్జర్, USB-C కేబుల్, క్విక్ స్టార్ట్ గైడ్ మరియు సిమ్ ఎజెక్టర్ టూల్ లభిస్తాయి. హానర్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు JD.com వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఇది ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉంది.

