NTV Telugu Site icon

Honor 200 Lite 5G Price: ‘హానర్‌’ సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌.. 108 ఎంపీ కెమెరా, ఏఐ ఫీచర్స్!ధర తక్కువే

Honor 200 Lite 5g Price

Honor 200 Lite 5g Price

Honor 200 Lite 5G Price in India: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ ‘హానర్‌’ సుదీర్ఘ విరామం తర్వాత గత ఏడాది భారతదేశంలో రీఎంట్రీ ఇచ్చింది. ‘హువావే’ నుంచి సెపరేట్ అయిన హానర్.. తన సొంత బ్రాండ్‌పై స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సొంతంగా ఇప్పటివరకు హానర్‌ ఎక్స్9బీ, హానర్‌ 200, హానర్‌ 200 ప్రోలను విడుదల చేసింది. తాజాగా ‘హానర్‌ 200 లైట్‌’ 5జీని రిలీజ్ చేసింది. 108 ఎంపీ కెమెరా, ఏఐ ఫీచర్లతో వచ్చిన ఈ మొబైల్‌ ధర 20 వేల కంటే తక్కువగా ఉండడం విశేషం. ఇప్పటివరకు హానర్‌ నుంచి వచ్చిన మొబైల్స్ 25 వేలకు పైనే ఉన్నాయి.

హానర్‌ 200 లైట్‌ ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. సియాన్‌ లేక్‌, మిడ్‌నైట్‌ బ్లూ, స్టేరీ బ్లాక్‌ రంగుల్లో ఇది లభిస్తుంది. సెప్టెంబర్‌ 27 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారభం కానున్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌తో పాటు కంపెనీ మెయిన్‌లైన్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఎస్‌బీఐ కార్డుపై రూ.2వేల వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.15,999కే హానర్‌ 200 లైట్‌ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: T20 World Cup 2024: టీమిండియాకు గాయల బెడద.. నలుగురు స్టార్ ప్లేయర్స్..!

హానర్‌ 200 లైట్‌ 5జీ ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది. 2000నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, మీడియా టెక్‌ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్‌ 8.0 ఔటాఫ్‌ది బాక్స్‌తో ఇది వస్తోంది. మ్యాజిక్‌ఎల్‌ఎం, మ్యాజిక్‌పోర్టల్‌, మ్యాజిక్‌ క్యాప్సల్‌, మ్యాజిక్‌ లాక్‌ స్క్రీన్‌.. వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. వెనకవైపు ఐఓఎస్‌కు సపోర్ట్‌ చేసే 108 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌, 5ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 2ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ ఉండగా.. ముందు వైపు 50 ఎంపీ కెమెరా ఉంది. 4500mAh బ్యాటరీ, 35W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో హానర్‌ 200 లైట్‌ వచ్చింది.