శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బరువు పెరుగుతారు.. బరువు పెరిగితే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు రావడం మొదలవుతాయి.. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణని అడ్డుకుంటుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలొస్తాయి. కొలెస్ట్రాల్ పరిమితి మించితే కచ్చితంగా దానిని తగ్గించుకునేందుకు మందులు వాడాలి. అయితే, కొన్ని ఫుడ్ ఐటెమ్స్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. ముఖ్యంగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్తప్రసరణని ఈజీగా చేస్తుంది. వెల్లుల్లిని తేనెలో కలిపి తింటే మరిన్ని లాభాలు.. అయితే బయట దొరికే తేనె కాకుండా స్వచ్ఛమైన తేనె అయితే మంచిది..
అవిసెలు కూడా చెడు కొలెస్ట్రాల్‌ని ఈజీగా తగ్గిస్తాయి. వీటిని పొడిలా చేసి పాలలో కలిపి తాగాలి. లేదా డైట్‌లో యాడ్ చేయొచ్చు. రోజుకి 30 గ్రాముల అవిసెలు తీసుకుంటే బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. షుగర్ వ్యాధి కూడా కంట్రోల్‌లో ఉంటుంది.. ఫైబర్ వీటిలో అధికంగా ఉంటుంది.. దాంతో కొలెస్ట్రాల్ సులువుగా తగ్గుతుంది..
ఓట్స్ తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. ఆయిలీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి. ఒత్తిడి లేకుండా చూసుకోండి. దీని వల్ల చాలా వరకూ కొలెస్ట్రాల్ మన దరి చేరకుండా ఉంటుంది..
తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి ఉదయాన్నే పరగడపున తీసుకోండి. అలానే దాల్చిన చెక్కని డైట్‌లో యాడ్ చేయడం వల్ల కొవ్వు త్వరగా తగ్గుతుంది.. నిమ్మకాయ, తేనెను కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
