NTV Telugu Site icon

Honda Monkey Bike: హోండా నుంచి చిన్న బైక్.. 125cc ఇంజిన్, 70 కిమీ మైలేజ్! ధర ఏంటంటే?

Honda Monkey Bike

Honda Monkey Bike

Honda Monkey Bike Price and Mileage: వాహనాల తయారీలో దిగ్గజ కంపెనీల నడుమ తీవ్ర పోటీ నడుస్తోంది. మార్కెట్లో తమ డిమాండ్‌ను నిలబెట్టుకునేందుకు అన్ని కంపెనీలు కొత్త వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రధానంగా బైక్‌ల విషయంలో పోటీ బాగా ఉన్న నేపథ్యంలో ‘హోండా’ కంపెనీ సరికొత్త చిన్న బైక్‌ను విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. హోండా మంకీ 125 పేరుతో రిలీజ్ చేయనుంది. ఈ బైక్ జపాన్‌లో సహా అనేక అంతర్జాతీయ మార్కెట్‌లలో బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ ఇటీవలే దాని కొత్త లైటింగ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. బైక్ పసుపు రంగులో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మంకీ లైట్నింగ్ ఎడిషన్ ఫోర్క్స్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, స్వింగ్‌ఆర్మ్ మరియు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లపై పసుపు రంగును కలిగి ఉంది.

క్రోమ్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల హోండా మంకీ 125 బైక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. ముందు మరియు వెనుక ఫెండర్లు, హెడ్‌ల్యాంప్‌లు, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్రేక్ మరియు క్లచ్ లివర్‌లు, టర్న్ ఇండికేటర్‌లు మరియు వెనుక టెయిల్ ల్యాంప్ అన్నీ క్రోమ్‌లో పూర్తి చేయబడ్డాయి. ఇది గరిష్టంగా 9.2 bhp శక్తిని మరియు 11 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 125cc ఇంజిన్‌తో పని చేస్తుంది. మునుపటి మంకీ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండగా.. ప్రస్తుత వెర్షన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని మైలేజీ లీటరుకు 70.5 కిమీ అని కంపెనీ పేర్కొంది.

Also Read: Smartphones Under 25000: 25 వేలలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు.. టాప్ 5 జాబితా ఇదే!

హోండా మంకీకి రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, ముందు వైపున ఏబీఎస్ ఉన్నాయి. ప్రయాణానికి 5.6 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఉంది. పెరిగిన ఫ్రంట్ ఫెండర్ మరియు బ్లాక్ ప్యాటర్న్ టైర్‌ల కారణంగా ఆఫ్-రోడ్ ట్రాక్‌లపై వెళ్లే సామర్థ్యాన్ని కూడా ఇది కలిగి ఉంది. కంపెనీ ఈ బైక్‌ను థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర TBH 108,900 (రూ. 2.59 లక్షలు). స్టాండర్డ్ మంకీ వేరియంట్ ధర 99,700 THB (దాదాపు రూ. 2.38 లక్షలు). హోండా మంకీ ఈస్టర్ ఎగ్ ఎడిషన్‌ ధర 109,900 THB (దాదాపు రూ. 2.62 లక్షలు).

హోండా మంకీ భారతీయ మార్కెట్‌లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడప్పుడే ఇక్కడ లాంచ్ అయ్యే అవకాశం లేదు. హోండా నవీ అనే మినీ బైక్‌ను భారతదేశంలో విక్రయిస్తోంది. దీనికి కస్టమర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అందులకే హోండా మంకీని భారతీయ మార్కెట్‌లో ఆలస్యంగా విడుదల చేయనున్నారట.

Also Read: Rohit Sharma Test Record: 146 ఏళ్ల టెస్ట్ చరిత్ర.. ‘ఒకే ఒక్కడు’గా రోహిత్ శర్మ!