These Unlucky Plants should not be grown at home: ఈ భూప్రపంచంలో చెట్లు, మొక్కలు గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. ఇవి చుట్టుపక్కల పర్యావరణంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అందుకే హిందూ గ్రంధాలలో చెట్లు, మొక్కలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని చెట్లు లేదా మొక్కలు పూజించదగినవిగా పరిగణించబడుతున్నాయి. అయితే ఇంకొన్నింటిని ఇంటి చుట్టూ నాటడం కూడా మంచిది కాదని హిందూ గ్రంధాలలో చెప్పబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం.. పొరపాటున కూడా ఇంట్లో నాటకూడని చెట్లు మరియు మొక్కల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇంట్లో ఈ మొక్కలు (Plant Vastu for Home) ఉండటం వల్ల ఇంటిలోని సంతోషం, ఐశ్వర్యం దెబ్బతింటాయి.
చింత చెట్టు:
చింత చెట్టు కూడా ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. కాబట్టి దీనిని గుడి, తోట లేదా రోడ్డు పక్కన బహిరంగ ప్రదేశంలో నాటడం మంచిది. ఇంట్లో ఎప్పుడూ చింత చెట్టు ఉండకూడదు.
పత్తి:
ఇంట్లో ఎప్పుడూ పత్తి మొక్కను నాటకండి. పత్తి మొక్క ఇంట్లోకి దురదృష్టాన్ని తెస్తుంది. సుఖ, సంతోషకరమైన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. పత్తి మొక్క ఉండడం వలన ఇంట్లో పేదరికం ఉంటుంది.
కాక్టస్:
కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో అస్సలు నాటవద్దు. ఇంటి బయట లేదా చుట్టుపక్కల ఉన్నా.. ఈ ముళ్ల మొక్కల ప్రభావం మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ముళ్ల మొక్కలు ఇంటిలోని ఆనందాన్ని, శాంతిని దూరం చేస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనస్పర్థలు కలిగిస్తాయి.
నిమ్మ మొక్క:
ఇంట్లో నిమ్మ మొక్కను పెంచడం కూడా అశుభం. ఇది ఇంట్లో ఇబ్బంది మరియు ఒత్తిడిని సృష్టించవచ్చు. మంచి సంబంధాలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
మెహందీ:
గోరింట మొక్కలు ఆహ్లాదకరమైన పరిమళాన్ని వెదజల్లిన్నప్పటికీ.. ఇంట్లో నాటడం చాలా అశుభం. ఈ మొక్క నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. దాంతో ఇంట్లోని వారు బాధలు మరియు సమస్యలకు గురవుతారు.
Also Read: David Warner Record: ప్రపంచ రికార్డు నెలకొల్పిన డేవిడ్ వార్నర్!
రావి చెట్టు:
పీపాల్ చెట్టు (రావి చెట్టు) ఇంట్లో ఉంటే వెంటనే తొలగించండి. ఇంట్లో లేదా ఇంటిపై రావి చెట్టు నీడ పడటం అశుభం. ఇది పేదరికం మరియు బాధలను కలిగిస్తుంది.
తాబేలు చెట్టు:
తాబేలు (బేరి) చెట్టుకు కూడా ముళ్లు ఉంటాయి. ఇంటి లోపల లేదా ఇంటి ముందు బెరడు చెట్టు ఉంటే జీవితంలో ఆటంకాలు పెరుగుతాయని హిందూ గ్రంధాలలో చెప్పబడింది. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని తెస్తుంది.
బోన్సాయ్:
బోన్సాయ్ మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రగతిపై చెడు ప్రభావం ఉంటుంది. కెరీర్‌లో నిత్యం ఆటంకాలు ఎదురవుతాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఇవ్వబడింది. ntvtelugu.com దానిని ధృవీకరించలేదు.)
Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?