Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్ లో అమ్ముడు పోని ఇళ్లు.. కారణం ఏంటో తెలుసా..?

Hyd

Hyd

దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో ప్రాజెక్ట్ ల లాంచింగ్ లు గణనీయంగా పెరిగాయి. దీంతో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు 12 శాతం మేర వృద్ధి చెందాయి. ఇన్వెంటరీలో 95 శాతం యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఇన్వెంటరీ 38 శాతం పెరిగింది. గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి ఏరియాలలో కొత్త ప్రాజెక్ట్‌లు భారీ స్థాయిలో ప్రారంభం కావటంతో ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణమని క్రెడాయ్‌-కొల్లియర్స్‌ నివేదిక తెలిపింది.

Also Read: Mulugu Accident: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో

అయితే.. గత తొమ్మిది త్రైమాసికాలుగా హైదరాబాద్ లో ఇళ్ల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. 2023 తొలి త్రైమాసికంలో మాత్రం 13 శాతం పెరిగాయి. గృహాలకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో 8 నగరాలలో ఇళ్ల ధరలు 8 శాతం వృద్ధి చెందాయి. అత్యధికంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ధరలు 16 శాతం, కోల్‌కతాలో 15 శాతం, బెంగళూరులో 14 శాతం మేర పెరిగాయని క్రెడాయ్-కొల్లియర్స్ నివేదికలో తేలింది. గత కొన్ని త్రైమాసికాలుగా గృహ కస్టమర్ల సెంటిమెంట్‌ సానుకూలంగా ఉంది. అయితే వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామగ్రి వ్యయాల వృద్ధి గృహాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ తెలిపారు.

Also Read: Utter Pradesh: తన పెద్దకర్మ తానే చేసుకున్న వృద్ధుడు..

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను పెంచినప్పటికీ ఇళ్ల ధరలు పెరుగుదల మాత్రం ఆగలేదు. గతేడాదితో పోలిస్తే డిమాండ్‌ నిలకడగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. రెపోరేట్ల పెంపు నిలిపివేస్తున్నట్టు శక్తికాంత దాస్‌ ప్రకటించడంతో రియాల్టీ రంగం ఆశాజనకంగా కనిపిస్తోంది. డిమాండ్‌ ఇంకా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు మొదలవ్వడంతో దేశవ్యాప్తంగా అన్‌సోల్డ్‌ ఇన్వెంటరీ వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగింది. ఇందులో 95 శాతం ఇళ్లు ఇంకా నిర్మాణదశలోనే ఉన్నాయి.

Also Read: Teeth: మీ పళ్లు పచ్చగా ఉన్నాయా.. ఇలా చేయండి ముత్యాల్లా మారుతాయి

ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను తీసుకోవాల్సిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు Ntvtelugu.com బాధ్యత వహించదు.

Exit mobile version